Donald Trump: మళ్లీ ఎన్నికైతే నియంతనవుతా : డోనాల్డ్ ట్రంప్
Donald Trump: తనకు రెండు టార్గెట్లు ఉన్నాయని, వాటిని నెరవేర్చేందుకు అవసరమైతే నియంతలా మారుతానని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా, మెక్సికో బోర్డర్లో చొరబాట్లను ఆపడం, ఎనర్జీ ప్రాజెక్టులకు ఊతం ఇవ్వడం తన లక్ష్యమని తెలిపారు. ప్రతిపక్షాలు తనను నియంతగా చిత్రీకరిస్తూ విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు.
న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ మళ్లీ దేశాధ్యక్షుడిగా ఎన్నికైతే నియంత తరహాలో పాలించనున్నట్లు చెప్పారు. రెండు లక్ష్యాల కోసం తాను నియంతగా మారనున్నట్లు ఆయన వెల్లడించారు. తనపై అక్రమ కేసులు బనాయించి విచారణ చేపడితే అప్పుడు అమెరికా స్తంభించిపోతుందన్నారు. తనను నియంతగా చిత్రీకరిస్తూ.. విపక్షాలు ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నాయని ట్రంప్ అన్నారు.
తానేమీ యుద్ధాలు చేయలేదని, విదేశాల్లో ఉన్న దళాలను వెనక్కి రప్పించానని, కానీ అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం యుద్ధ కాంక్షనే రాజకీయ ఎత్తుగడగా వాడుకుంటున్నారని ట్రంప్ ఆరోపించారు. ఈ ఏడాది కూడా దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు రిపబ్లికన్ నేత ట్రంప్ ఆసక్తిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే క్యాపిటల్ హిల్ అటాక్ కేసులో ఆయన్ను దోషిగా తేల్చి దేశాధ్యక్ష పదవికి దూరంగా చేయాలని డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ట్రంప్‌కు రెండో సారి అధికారం ఇస్తే అమెరికా ప్రజాస్వామ్యం నాశనం అవుతుందని ఇటీవల బైడెన్ పేర్కొన్నారు. అమెరికా-మెక్సికో బోర్డర్ మధ్య అక్రమ చొరబాట్లను నిలిపివేయడం, ఆ తర్వాత ఎనర్జీ ప్రాజెక్టులకు ఊతం ఇవ్వడమే తన లక్ష్యమని, ఆ రెండు లక్ష్యాల కోసం నియంతలా మారుతానని, ఆ రెండు పనులు పూర్తి అయిన తర్వాత తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోనున్నట్లు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

