Donald Trump: ఏ తప్పూ చేయలేదు: డోనాల్డ్ ట్రంప్
Donald Trump: బైడెన్ అవినీతికి పాల్పడుతున్నారని, అధికార దుర్వినియోగం జరుగుతోందని ట్రంప్ అన్నారు. రహస్య పత్రాలు కలిగి ఉన్న కేసులో మియామి కోర్టుకు హాజరైన తర్వాత ఆయన మాట్లాడారు. బాండ్ షరతుపై ట్రంప్‌ను రిలీజ్ చేశారు. ఏ తప్పూ చేయలేదని కోర్టుకు చెప్పారు. ఆయనపై ట్రావెల్ ఆంక్షలు విధించలేదు.
ఫ్లోరిడా: రహస్య పత్రాలు కలిగి ఉన్న కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) .. మియామి కోర్టుకు హాజరయ్యారు. తాను ఏ తప్పూ చేయలేదని కోర్టుకు తెలిపారు. అతి సున్నితమైన రహస్య పత్రాలు దాచిన కేసులో ట్రంప్‌పై నేరాభియోగం నమోదు అయ్యిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ట్రంప్ కోర్టుకు హాజరుకావడం ఇది రెండోసారి. ఆ తర్వాత ఆయన న్యూజెర్సీలోని బెడ్‌మిన్‌స్టర్‌లో ఉన్న గోల్ఫ్ కోర్సుకు వెళ్లారు. అక్కడ అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడారు.
క్లాసిఫైడ్ డాక్యుమెంట్లను దగ్గర పెట్టుకునేందుకు తనకు అన్ని హక్కులు ఉన్నట్లు ఆయన చెప్పారు. 76 ఏళ్ల ట్రంప్‌పై మెజిస్ట్రేట్ జడ్జి జోనాథన్ గుడ్మాన్ ఎటువంటి ఆంక్షలు విధించలేదు. దేశీయ, అంతర్జాతీయ ట్రావెల్ ఆంక్షలు విధించలేదు. చాలా హేయమైన రీతిలో అధికార దుర్వినియోగానికి బైడెన్ ప్రభుత్వం పాల్పడుతోందని ట్రంప్ విమర్శించారు.
పూచీకత్తుపై ట్రంప్‌ను రిలీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన అంశాలను సాక్ష్యాలతో చర్చించరాదు అని కోర్టు ఆదేశించింది. రహస్య పత్రాలు కలిగి ఉన్న కేసులో ట్రంప్‌పై 37 నేరాభియోగాలు నమోదు అయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

