Adani | అదానీ కేసు అటకెక్కినట్టే?.. ఎఫ్సీపీఏను నిలిపేస్తూ ట్రంప్ ఆదేశం!
అమెరికాలో అమలులో ఉన్న ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్(ఎఫ్‌సీపీఏ)ను నిలిపివేయాలని న్యాయ శాఖను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు.
- ఎఫ్సీపీఏను నిలిపేస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశం
- ఇదే చట్టం కింద అదానీపై అమెరికాలో అభియోగాలు
- మోదీ అమెరికా పర్యటన ముందు కీలక పరిణామం
Adani | వాషింగ్టన్, ఫిబ్రవరి 11: అమెరికాలో అమలులో ఉన్న ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ)ను నిలిపివేయాలని న్యాయ శాఖను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు. ఈ చట్టం వినడానికి బాగానే ఉన్నా దేశానికి నష్టం చేస్తున్నదని, జైలు భయంతో అమెరికా కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకోలేకపోతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికన్ కంపెనీలు అంతర్జాతీయంగా చట్టాలను ఉల్లంఘనలకు పాల్పడకుండా 1977లో అమెరికా ఈ చట్టాన్ని చేసింది. అమెరికాలో లంచాలు ఇచ్చే విదేశీయులు, విదేశీ సంస్థలను కూడా ఈ చట్టం పరిధిలోకి తెస్తూ 1998లో సవరించారు.
ఈ చట్టం కిందే అదానీపై అభియోగాలు
ఎఫ్సీపీఏను నిలిపివేయడం గౌతమ్ అదానీకి భారీ ఊరట కలిగించనుంది. అదానీ, ఆయన అనుచరులు భారత్‌లో విద్యుత్తు కాంట్రాక్టులు పొందేందుకు భారతీయ అధికారులకు భారీగా లంచాలు ఎర వేశారని గత ఏడాది అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్(డీఓజే) ఈ చట్టం కిందనే అభియోగాలు మోపింది. అదానీ సంస్థల్లో కొందరు పెట్టుబడిదారులు అమెరికన్లు కావడంతో ఈ చట్టం వర్తించింది.
ఇప్పుడు ఈ చట్టాన్నే నిలిపివేస్తూ ట్రంప్ ఉత్తర్వులు ఇవ్వడంతో అదానీ సంస్థపై విచారణ నిలిచిపోయే అవకాశం ఉంది. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు ఒక రోజు ముందు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నెల 12, 13 తేదీల్లో మోదీ అమెరికాలో పర్యటించనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

