Donald Trump | ఎలాన్ మస్క్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్నా.. వెల్లడించిన డోనాల్డ్ ట్రంప్..!
Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయాలు వేడెక్కాయి. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ బరిలో నిలిచారు. అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు అధ్యక్ష పీఠానికి పోటీ చేసే అవకాశం దక్కింది.
Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయాలు వేడెక్కాయి. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ బరిలో నిలిచారు. అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు అధ్యక్ష పీఠానికి పోటీ చేసే అవకాశం దక్కింది. ఇక రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మరోసారి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష రేసులో ఉన్నారు. బైడెన్ రేసు నుంచి తప్పుకోవడం ఆ పార్టీకి కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు ట్రంప్ గెలుపే ఖాయమని పలు సర్వే ఫలితాల్లో తేలింది. కమలా హ్యారిస్ పోటీకి దిగడంతో సర్వే ఫలితాలు భిన్నంగా వస్తున్నాయి. దాంతో అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీ సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. రాబోయే వారంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనున్నది. ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ అధ్యక్ష రేసులో బరిలో నిలిచిన డోనాల్డ్ ట్రంప్‌ని ఇంటర్వ్యూ చేయనున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. సోమవారం రాత్రి ఎలాన్ మస్క్‌కి ఇంటర్వ్యూ ఇస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ట్రంప్‌కు ఎలాన్ మస్క్ మద్దతు ఇస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో మాజీ అధ్యక్షుడు చేసే వ్యాఖ్యలను సమర్థిస్తూ వస్తుంటారు. ఇటీవల ట్రంప్ లైవ్ స్ట్రీమర్ అడిన్ రోస్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘కిక్’ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో ప్రసారమైంది. దాంతో రికార్డు స్థాయిలో ప్లాట్‌ఫామ్‌కు రికార్డు స్థాయిలో వ్యూయర్స్ పెరగడం విశేషం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

