Imran Khan | తన భార్య బుష్రా బీబీ ( Bushra Bibi) పై విషప్రయోగం (Poisoned) జరిగిందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ (Imran Khan) ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఇమ్రాన్ ఆరోపణలను వ్యక్తిగత వైద్యుడు అసిమ్ యూసఫ్ (Asim Yousuf) కొట్టిపారేశారు. మాజీ ప్రథమ మహిళను పరీక్షించామని, అయితే విషప్రయోగం జరిగినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు జియో న్యూస్ వెల్లడించింది. ‘వైద్య పరీక్షలో మాజీ ప్రథమ మహిళకు విషపూరితమైన పదార్థాన్ని ప్రయోగించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. బుష్రా బీబీకి విషప్రయోగం జరిగిన లక్షణాలు కూడా ఏమీ లేవు’ అని యూసఫ్ వెల్లడించినట్లు జియో న్యూస్ తెలిపింది.
కాగా, తన భార్యపై విషప్రయోగం జరిగినట్లు ఇమ్రాన్ ఇటీవలే ఆరోపించిన విషయం తెలిసిందే. అందుకు ఆధారాలున్నాయని జడ్జికి తెలియచేశారు. తన భార్యను ప్రైవేట్ నివాసంలో నిర్బంధించారని, దానిని సబ్జైల్గా మార్చారని పేర్కొన్నారు. ఆమెకు ఏమైనా జరిగితే ఆర్మీ చీఫ్ బాధ్యత వహించాలన్నారు. కాగా, ఇమ్రాన్ భార్య బుష్రా మాట్లాడుతూ తాను అమెరికన్ ఏజెంట్ అని పుకార్లు పుట్టించారని, తన ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలిపారని ఆరోపించారు.
Also Read..
KTR | ఎండ వేడిమికి రిఫ్రెష్.. పాఠశాల పిల్లలతో కలిసి ఫ్రూట్ జ్యూస్ తాగిన కేటీఆర్
S Jaishankar | ఎన్నికల గురించి వాళ్లు మాకు చెప్పాల్సిన పనిలేదు.. ఐరాసకు భారత్ ధీటైన సమాధానం
Hemant Soren | లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి హేమంత్ సోరెన్ దూరం..!