Viral news | కాలికి ముళ్లులా గుచ్చుకున్న అదృష్టం.. కోట్లకు అధిపతి అయిన అమెరికన్..!
Diamond | ఒక్కోసారి మనం ఏం చేసినా చెడే జరుగుతుంటుంది. అలాంటప్పుడు దరిద్రం శనిలా దాపురించిందని బాధ పడుతుంటాం. అదేవిధంగా కొన్నిసార్లు మనం ఏం చేసినా మంచే జరుగుతుంది. అప్పుడు అదృష్టం గజ్జిలా పట్టుకుందని సరదాగా చెప్పుకుంటాం. అయితే అమెరికాలో ఓ వ్యక్తిని మాత్రం అదృష్టం విచిత్ర రీతిలో వరించింది. పార్కులో వాకింగ్ చేస్తున్న అతని కాలికి ముళ్లులా గుచ్చుకుంది. అదృష్టం కాలికి ముళ్లులా గుచ్చుకోవడం ఏంటి..? అని ఆలోచిస్తున్నారా..? అయితే పదండి వివరాల్లోకి వెళ్దాం..
Viral news : ఒక్కోసారి మనం ఏం చేసినా చెడే జరుగుతుంటుంది. అలాంటప్పుడు దరిద్రం శనిలా దాపురించిందని బాధ పడుతుంటాం. అదేవిధంగా కొన్నిసార్లు మనం ఏం చేసినా మంచే జరుగుతుంది. అప్పుడు అదృష్టం గజ్జిలా పట్టుకుందని సరదాగా చెప్పుకుంటాం. అయితే అమెరికాలో ఓ వ్యక్తిని మాత్రం అదృష్టం విచిత్ర రీతిలో వరించింది. పార్కులో వాకింగ్ చేస్తున్న అతని కాలికి ముళ్లులా గుచ్చుకుంది. అదృష్టం కాలికి ముళ్లులా గుచ్చుకోవడం ఏంటి..? అని ఆలోచిస్తున్నారా..? అయితే పదండి వివరాల్లోకి వెళ్దాం..
అమెరికాలోని అర్కాన్సాస్లో జెర్రీ ఎవాన్స్ అనే వ్యక్తి ఉన్నాడు. ఒకరోజు జెర్రీ ఎవాన్స్ వాకింగ్ కోసం క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్కుకు వెళ్లాడు. వాకింగ్ చేస్తుండగా అతని కాలికి గాజు ముక్క గుచ్చుకుంది. కాలికి గుచ్చుకున్న ఆ గాజు ముక్కను తీసిన జెర్రీ.. అక్కడే పడేస్తే మరెవరికైనా గుచ్చుకుంటుందనే ఆలోచనతో దాన్ని జేబులో వేసుకుని మర్చిపోయాడు. ఇంటికి వెళ్లిన తర్వాత జేబులో చేయి పెట్టుకున్న అతనికి గాజు ముక్క తగలడంతో తీసి చూశాడు.
ఇంట్లో ఆ గాజు ముక్కను నిశితంగా పరిశీలించిన జెర్రీ దానిలో ప్రత్యేకమైన మెరుపును గమనించాడు. అనుమానంతో దాన్ని తెలిసిన వ్యక్తులకు చూపించాడు. దాంతో అది సాధారణ గాజు ముక్క కాదని, వజ్రమని వాళ్లు చెప్పారు. అయినా నమ్మకం కుదరని జెర్రీ.. దాన్ని జమాలజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా వారి దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ దాన్ని పరిశీలించిన నిపుణులు అది కోట్ల రూపాయల విలువ చేసే 4.87 క్యారట్ వజ్రం అని తేల్చారు. దాంతో జెర్రీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఎందుకంటే క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్కు ఓపెన్ పాలసీని కలిగి ఉంది. అంటే ఆ పార్కుకు వచ్చిన వ్యక్తుల్లో ఎవరికైనా వజ్రం దొరికితే అది వారికే సొంతం. ఆ పార్కు నిబంధనలు అందుకు అనుమతిస్తున్నాయి. దాంతో తనకు గుచ్చుకున్నది గాజు ముక్క కాదు వజ్రం అని తేల్చుకున్న జెర్రీ.. పార్కు అధికారులను కలిసి ఆ వజ్రాన్ని అధికారికంగా తన పేరు మీద రిజస్టర్ చేయించుకున్నాడు. ఒక్క రోజులో కోటీశ్వరుడు అయిపోయాడు. అంటే అదృష్టం కాలికి ముళ్లులా గుచ్చుకున్నట్టేగా..?
కాగా, 1972లో ఆ స్టేట్ పార్క్ స్థాపించబడినప్పటి నుంచి అక్కడ 75 వేలకుపైగా వజ్రాలు లభించాయి. కానీ జెర్రీ ఎవాన్స్‌కు దొరికింది అత్యంత విలువైన వజ్రం. దాదాపు మూడేళ్ల తర్వాత ఆ పార్కులో మళ్లీ అంత విలువైన వజ్రం దొరకడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. 2020లో ఒక వ్యక్తికి 9.07 క్యారట్ బ్రౌన్ డైమండ్ దొరికిందని వెల్లడించారు. అయితే ఈ మూడేళ్ల కాలంలో కూడా చిన్నచితకా వజ్రాలు చాలా దొరికాయని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

