Viral News | నులక మంచం @ రూ.1.12 లక్షలు.. భారతీయ మంచాలకు అమెరికాలో డిమాండ్
Viral News | నులక మంచం (గడంచ) గ్రామీణ నేపథ్యం ఉన్న వారందరికీ దీని గురించి తెలుసు. అమ్మమ్మ, తాతయ్యల ఊళ్లకు వెళ్లినప్పుడు ఆరుబయట ఇలాంటి మంచాలపైనే పడుకొని ఆకాశం వంక చూస్తూ సేదతీరే వారు. ఇప్పుడిదంతా ఎందుకంటారా? అసలు విషయం తెలిస్తే మీరు నోరెళ్ల బెడతారు మరి.
Viral News | నులక మంచం (గడంచ) గ్రామీణ నేపథ్యం ఉన్న వారందరికీ దీని గురించి తెలుసు. అమ్మమ్మ, తాతయ్యల ఊళ్లకు వెళ్లినప్పుడు ఆరుబయట ఇలాంటి మంచాలపైనే పడుకొని ఆకాశం వంక చూస్తూ సేదతీరే వారు. ఇప్పుడిదంతా ఎందుకంటారా? అసలు విషయం తెలిస్తే మీరు నోరెళ్ల బెడతారు మరి. ఐకియా లాంటి అతిపెద్ద షోరూంలలో అత్యాధునిక మంచాలు కొన్నా అంత ధర పలుకవు. కానీ మన గ్రామీణ నులక మంచం మాత్రం లక్షకు పైగా పలుకుతున్నది. ఆశ్చర్యపోకండి.. ఇది మనదేశంలో కాదు.. అమెరికాలోనండి. పైగా అక్కడ ఈ టైపు మంచాలకు తెగ డిమాండ్ కూడా ఉన్నదట. జనం ఎగబడి కొంటున్నారట. అమెరికాకు చెందిన ఎట్సీ అనే ఈ కామర్స్ సంస్థ తన ఆన్లైన్ స్టోర్లో నులకమంచాలను విక్రయిస్తున్నది.
ఒక్కో మంచం ధర రూ.1.12 లక్షల రేట్ ఫిక్స్ చేసింది. అందంగా ముస్తాబు చేసిన భారతీయ సంప్రదాయ మంచం అని డిస్క్రిప్షన్లో ఇచ్చింది. మంచం పొడవు 72 అంగుళాలు, వెడల్పు 32 అంగుళాలుంటుంది. ఇప్పుడు ఈ సంస్థ వద్ద కూడా కేవలం నాలుగంటే నాలుగు మంచాలే స్టాక్ ఉన్నాయట. ఇప్పటి దాకా 82 నులక మంచాలను విక్రయించినట్టు సంస్థ పోర్టల్ పేర్కొన్నది. హైవేలలో రోడ్ల పక్కన వెలసిన చాలా దాభాల్లో ఇప్పటికీ నులక మంచాలు కనిపిస్తుంటాయి. సుదూర ప్రాంతాలకు సరుకులు రవాణా చేసే డ్రైవర్లు, క్లీనర్లు రాత్రిళ్లు, మధ్యాహ్నం తినే సమయాల్లో దాభాల్లోని నులక మంచాలపై సేదతీరుతూ కనిపిస్తుంటారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

