Starship | 40 నిమిషాల్లోనే ఢిల్లీ టు శాన్ఫ్రాన్సిస్కో.. ఎలాగంటే?
వ్యోమనౌక అంటే వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లేది అనే అర్థం మారే అవకాశం ఉన్నది. వ్యోమనౌకను సూపర్‌ఫాస్ట్ విమానంగా వినియోగించేందుకు స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కొత్త ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తున్నది.
- స్పేస్ఎక్స్ స్టార్‌షిప్‌తో ప్రయాణించే అవకాశం
- సాధ్యం చేసే ప్రయత్నాల్లో మస్క్
Starship | న్యూయార్క్, నవంబర్ 15: వ్యోమనౌక అంటే వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లేది అనే అర్థం మారే అవకాశం ఉన్నది. వ్యోమనౌకను సూపర్‌ఫాస్ట్ విమానంగా వినియోగించేందుకు స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కొత్త ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రపంచంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించాలని మస్క్ భావిస్తున్నారట. తన స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన స్టార్‌షిప్ వ్యోమనౌక ద్వారా అంగారకుడిపైకి మనుషులను పంపించాలని ఇంతకాలంగా మస్క్ ప్రణాళిక. అయితే, భూమిపై మనుషుల ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు స్టార్‌షిప్‌ను వినియోగించాలని మస్క్ వ్యూహాలు రచిస్తున్నట్టు ఒక కథనం వెలువడింది. స్టార్‌షిప్ ద్వారా సాధారణ విమాన ప్రయాణ దూరాన్ని దాదాపు 2,200 శాతం తగ్గించొచ్చని మస్క్ భావిస్తున్నట్టు ‘యూనిలాడ్ టెక్’ వార్తాసంస్థ పేర్కొన్నది.
గంటకు 27 వేల కిలోమీటర్ల వేగం..
మొదట అమెరికాలోని న్యూయార్క్ నుంచి చైనాలోని షాంఘై మధ్య స్టార్‌షిప్‌ను నడిపించాలని మస్క్ ప్రణాళికలు రచిస్తున్నట్టు వార్తాసంస్థ తెలిపింది. ఈ రెండు నగరాల మధ్య విమాన ప్రయాణ దూరం దాదాపుగా 14 గంటల 50 నిమిషాలు. స్టార్‌షిప్‌లో మాత్రం 39 నిమిషాల్లో చేరుకోవచ్చట. గంటకు 27 వేల కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించే సామర్థ్యం స్టార్‌షిప్ వ్యోమనౌకకు ఉంది. రెండో దశలో లండన్ నుంచి న్యూయార్క్‌కు, పారిస్ నుంచి న్యూయార్క్‌కు, ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు సైతం స్టార్‌షిప్‌ను నడిపించాలని మస్క్ భావిస్తున్నారట. ఇది కనుక అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం బాగా తగ్గి ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు కేవలం 40 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

