టీకాలు తీసుకోనివారిలో వేగంగా డెల్టా ప్లస్ వ్యాప్తి
Delta plus spreading: ఇప్పటివరకు గుర్తించిన కరోనా వైరస్ వేరియంట్లలో అత్యంత వేగంగా సంక్రమణం చెందుతున్నది డెల్టా రకమేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొన్నది.

జెనీవా: ఇప్పటివరకు గుర్తించిన కరోనా వైరస్ వేరియంట్లలో అత్యంత వేగంగా సంక్రమణం చెందుతున్నది డెల్టా రకమేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొన్నది. కొవిడ్-19 టీకాలు తీసుకోని వారిలో ఈ రకం శరవేగంగా వ్యాపిస్తోందని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో డెల్టా రకాన్ని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో అధిపతి టెడ్రోస్ అధనోమ్ గాబ్రియేసస్ తెలిపారు. డెల్టా రకంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నట్లు వెల్లడించారు.
ఈ దశలో కొన్ని దేశాల్లో కొవిడ్ నిబంధనలను సడలించడం కూడా ఆందోళనకరమేనని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా డెల్టా ప్లస్ సంక్రమణం పెరుగడం ప్రారంభమైందన్నారు. ఈ నేపథ్యంలో వైరస్ సంక్రమణను నిరోధించడానికి ఉన్న అన్ని సాధానాలను ఉపయోగించడం అత్యవసరమని స్పష్టంచేశారు. డెల్టా రకం గతంలో ఐరోపాలో తీవ్రంగా వ్యాప్తి చెందిన ‘ఆల్ఫా’ కంటే ప్రమాదకరమన్నారు.
ఈ దశలో వ్యాధి తీవ్రమయ్యే ముప్పును, మరణాల ముప్పును కొవిడ్ వ్యాక్సిన్లు సమర్థంగా అడ్డుకుంటాయని చెప్పారు. డెల్టా రకాలపై అవి చక్కగా పనిచేస్తాయని స్పష్టంచేశారు. ప్రజలు పెద్దఎత్తున గుమిగూడటం వంటివాటి వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పూర్తిస్థాయిలో టీకాలు పొందినవారు కూడా మాస్కులు ధరించడం, ఇతర కొవిడ్ సంబంధిత జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది.
డెల్టా రకం విజృంభణ నేపథ్యంలో ఇలాంటి చర్యలు మరింత అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ తెలిపారు. రెండు డోసులు పొందినవారు కూడా నిబంధనలను పాటించకపోతే ఇన్ఫెక్షన్ వ్యాప్తికి కారకులవుతారని సంస్థ సీనియర్ సలహాదారు బ్రూస్ ఆల్వార్డ్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

