కాంగోలో అగ్నిపర్వతం పేలి 32 మంది మృతి
అగ్నిపర్వతం| కాంగోలోని గోమాలో అగ్నిపర్వతం పేలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 32కు పెరిగింది. గోమాలో అగ్నిపర్వతం పేలడంతో లావా ప్రవహించింది. దీంతో లావాను చల్లబరుస్తుండగా ఊపిరి ఆడక ఐదుగురు మరణించారు.

కిన్షాస: కాంగోలోని గోమాలో అగ్నిపర్వతం పేలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 32కు పెరిగింది. గోమాలో అగ్నిపర్వతం పేలడంతో లావా ప్రవహించింది. దీంతో లావాను చల్లబరుస్తుండగా ఊపిరి ఆడక ఐదుగురు మరణించారు. మరో వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో దవాఖానలో చేరాడని అధికారులు వెల్లడించారు. అగ్నిపర్వతం నుంచి ప్రవహించిన లావా ఇళ్లను ముంచెత్తింది. దీంతో తొమ్మిది మంది దహనమయ్యారు. అదేవిధంగా గోమా జైలు నుంచి ఖైదీలను తరలిస్తుండగా ట్రక్కు బోల్తా పడి 14మంది దుర్మరణం చెందారు. బాధితులను ఆదుకోవడానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

