Hawaii Wildfire | హవాయి ద్వీపంలో కార్చిచ్చు బీభత్సం.. 53కు చేరిన మృతులు, వెయ్యికిపైగా ఇండ్లు దగ్ధం
అమెరికాలోని హవాయి (Hawaii) ద్వీపంలో కార్చిచ్చు (Wildfire) బీభత్సం సృష్టిస్తున్నది. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మావీయ్ ద్వీపం (Maui island) అల్లకల్లోలంగా మారింది. వేయ్యికిపైగా ఇండ్లు దగ్ధమయ్యాయి. దావాగ్ని వల్ల ఇప్పటివరకు 53 మంది మరణించారు.
Hawaii Wildfire | అమెరికాలోని హవాయి (Hawaii) ద్వీపంలో కార్చిచ్చు (Wildfire) బీభత్సం సృష్టిస్తున్నది. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మావీయ్ ద్వీపం (Maui island) అల్లకల్లోలంగా మారింది. వేయ్యికిపైగా ఇండ్లు దగ్ధమయ్యాయి. దావాగ్ని వల్ల ఇప్పటివరకు 53 మంది మరణించారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నికి గాలులు తోడవడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి (Fast-moving fire). దీంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల వల్ల గురువారం నాటికి 36 మంది మృతిచెందగా, తాజాగా మరో 17 మంది చనిపోయారని అధికారులు తెలిపారు.
కాగా, మంగళవారం రాత్రి నుంచి ఈ కార్చిచ్చు వ్యాపిస్తున్నట్లు మావీయ్ కౌంటీ (Maui County) వెల్లడించింది. కార్చిచ్చుకు తోడు హవాయి సమీపంలో గంటకు 82 మైళ్ల వేగంతో, మావీయ్‌లో గంటకు 62 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంటల ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయని, చెట్లు, కార్లు, ఇతర వాహనాలు కాలి బూడిదైనట్లు చెప్పారు. దావాగ్ని చుట్టుముట్టిన పరిస్థితుల కారణంగా అధికారులు రోడ్లను మూసివేశారు. ఒక్క హైవే మాత్రమే అందుబాటులో ఉడటంతో.. ఆ మార్గం గుండా వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.





Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రెండో టెస్టులో సఫారీల ఘన విజయం
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

