Daniela Vera | ఆశ్చర్యం.. 56 ఏండ్లుగా గర్భంతో మహిళ.. 81 ఏళ్ల వయసులో పిండం తొలగింపు..!
Daniela Vera | సాధారణంగా గర్భిణులు 9 నెలలపాటు పిండాన్ని మోస్తారు. ఆ తర్వాత బిడ్డకు జన్మనిస్తారు. కానీ బ్రెజిల్‌కు చెందిన ఓ 81 ఏళ్ల మహిళ దాదాపు 56 ఏళ్లుగా గర్భంతో ఉంది. ఆమె గర్భం దాల్చిన సంగతి ఆమెకే తెలియలేదు. ఇటీవల ఓ రోజు కడుపు నొప్పి రావడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లగా విషయం బయటపడింది. దాంతో డాక్టర్లే షాకయ్యారు. ఈ వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
Daniela Vera : సాధారణంగా గర్భిణులు 9 నెలలపాటు పిండాన్ని మోస్తారు. ఆ తర్వాత బిడ్డకు జన్మనిస్తారు. కానీ బ్రెజిల్‌కు చెందిన ఓ 81 ఏళ్ల మహిళ దాదాపు 56 ఏళ్లుగా గర్భంతో ఉంది. ఆమె గర్భం దాల్చిన సంగతి ఆమెకే తెలియలేదు. ఇటీవల ఓ రోజు కడుపు నొప్పి రావడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లగా విషయం బయటపడింది. దాంతో డాక్టర్లే షాకయ్యారు. ఈ వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
బ్రెజిల్ మీడియా కథనాల ప్రకారం.. ఆ దేశానికి చెందిన డానియెలా వెరా అనే మహిళ 56 ఏండ్ల క్రితం గర్భం దాల్చింది. కానీ ఆమెకు 81 ఏళ్ల వయసొచ్చినా ప్రసవించలేదు. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఆమె కడుపులో పిండం అలాగే ఉండిపోయింది. చాలా ఏళ్ల క్రితమే మృతి చెందిన పిండం కడుపులో అలాగే గడ్డకట్టుకుపోయింది. కానీ ఆమెలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదు. దాంతో ఆమె ఈ విషయాన్ని గుర్తించలేకపోయింది.
ఇటీవల ఆమె పరాగ్వా సరిహద్దు మీదుగా స్వదేశానికి వస్తుండగా కడుపులో నొప్పి మొదలైంది. వెంటనే వైద్యులను సంప్రదించిన ఆమెకు కడుపులో పిండం ఉన్నట్టు తేలింది. స్కానింగ్ ఫిల్మ్‌లో బాధితురాలి కడుపులో పిండం కనిపించడంతో వైద్యులు షాకయ్యారు. వైద్యుల ద్వారా విషయం తెలుసుకుని డానియెలా కూడా షాకయ్యింది. ఆ పిండం మరణించి దాదాపు 56 ఏళ్లయ్యిందని వైద్య నిపుణుల పరిశీలనలో తేలింది.
వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి రీత్యా వైద్యులు మార్చి 15న ఆపరేషన్ చేసి మృత పిండాన్ని వెలికితీశారు. ఆ తర్వాత మహిళ ఇన్ఫెక్షన్ బారినపడి ఇటీవలే మృతిచెందింది. కాగా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (Ectopic pregnancy) కలిగిన సందర్భాల్లో ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. గర్భసంచి బయట పిండం పెరిగితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారని చెప్పారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల పిండం ఎక్కువ కాలం మనలేక మరణించడంతో ఇలా జరుగుతుందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

