ప్రాగ్: చెక్ రిపబ్లిక్( Czech Republic)లో ఓ గమ్మత్తు ఘటన జరిగింది. ఆ సంఘటన తెగ నవ్వులు తెప్పిస్తున్నది. ఆ దేశాధ్యక్షుడు పీటర్ పావెల్ చేతుల్లో ఉన్న జెండా .. దగ్గరల్లో నిలుచుకున్న సైనికుడి టోపీని తాకింది. జెండా రాడ్డు బరువుకు టోపీ కింద పడిపోయింది. ఈ ఘటనకు చెందిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. రాజధాని ప్రాగ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు పావెల్.. సైనికాధికారి నుంచి జాతీయ జెండాను అందుకున్నారు. అయితే ఆ జెండా బరువు ఎక్కువ ఉండడంతో.. అతని చేతుల్లో వంగిపోయింది. ఎడమవైపున నిలుచున్న సైనికుడి టోపీని తాకింది. ఆ టోపీ కిందా పడ్డా.. చేతుల్లో కత్తి ఉన్న ఆ సైనికుడు మాత్రం తడబడకుండా పరేడ్ చేశాడు. ఆ సైనికుడి వెనుక ఉన్న మరో సైనికుడు జరిగిన ఘటనపై నవ్వును ఆపుకునే ప్రయత్నం చేశాడు. మీరు కూడా ఆ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.
Czech president knocks off soldier’s hat with a flag
Follow us on Gab: https://t.co/IuhLFQBiZE pic.twitter.com/jVvQYdG03n
— RT (@RT_com) October 29, 2023