Couple miraculously escapes death | ఒకే రోజు రెండు వేర్వేరు విమాన ప్రమాదాలు.. ప్రాణాలతో బయటపడిన జంట
Couple miraculously escapes death | ఒకే రోజు జరిగిన రెండు వేర్వేరు విమాన ప్రమాదాల నుంచి విడివిడిగా ప్రయాణించిన జంట అద్భుతంగా ప్రాణాలతో బయటపడింది. (Couple miraculously escapes death) మహిళకు ఇదే తొలి విమాన ప్రయాణం కావడంతో కాబోయే భర్త చాలా ఆందోళన చెందాడు. గాయపడిన ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు.
రోమ్: ఒకే రోజు జరిగిన రెండు వేర్వేరు విమాన ప్రమాదాల నుంచి విడివిడిగా ప్రయాణించిన జంట అద్భుతంగా ప్రాణాలతో బయటపడింది. (Couple miraculously escapes death) మహిళకు ఇదే తొలి విమాన ప్రయాణం కావడంతో కాబోయే భర్త చాలా ఆందోళన చెందాడు. గాయపడిన ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ఇటలీలో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల స్టెఫానో పిరెల్లి, కాబోయే భార్య 22 ఏళ్ల ఆంటోనియెట్టా డెమాసి రెండు విమానాల్లో విడిగా ప్రయాణించారు. స్నేహితులతో కలిసి లంచ్ కోసం సవోనాకు బయలుదేరారు. అయితే స్టెఫానో ప్రయాణించిన రెండు సీట్ల చిన్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అది కూలిపోయింది. అదృష్టవశాత్తు స్టెఫానోకు చిన్న గాయమైనా కాలేదు.
కాగా, స్టెఫానో విమానం కూలిన ప్రాంతం నుంచి 25 మైళ్ల దూరంలోని బుసానో సమీపంలో ఆంటోనియెట్టా ప్రయాణించిన చిన్న విమానంలో కూడా సాంకేతిక సమస్య ఎదుర్కొంది. దీంతో పైలట్ నియంత్రణ కోల్పోవడంతో అది కూడా కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఆంటోనియెట్టా కూడా ప్రాణాలతో బయటపడింది. ఆమెతోపాటు విమానం పైలట్ గాయపడ్డాడు. రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు కాబోయే భార్య ప్రయాణించిన విమానం కూడా ప్రమాదానికి గురైనట్లు తెలిసి స్టెఫానో చాలా ఆందోళన చెందాడు. ఆంటోనియెట్టాకు ఇది తొలి విమాన ప్రయాణమని చెప్పాడు. గాయపడిన ఆమెతోపాటు పైలట్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. పొగమంచు, చీకటి వల్ల తాము ప్రయాణించిన వేర్వేరు విమానాలు ప్రమాదానికి గురైనట్లు అతడు వెల్లడించాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

