కరోనా.. చైనా జీవాయుధమే!

- మూడో ప్రపంచయుద్ధం కోసమే
- వైరస్‌ను వేరే దేశాలపై ప్రయోగించడంపై ఆరేండ్ల క్రితమే చైనా శాస్త్రవేత్తల చర్చ
- అధికారిక డాక్యుమెంట్లో వివరాలు
- వీకెండ్ ఆస్ట్రేలియా కథనంలో వెల్లడి
కరోనా మహమ్మారి ప్రపంచం మీదకు చైనా వదిలిన జీవాయుధమేనన్న అనుమానాలకు బలం చేకూర్చేలా ఆ దేశ అధికారిక డాక్యుమెంట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. కరోనాను జీవాయుధంగా మార్చి ప్రపంచంపైకి వదిలితే ఎలా ఉంటుందని చైనా శాస్త్రవేత్తలు ఆరేండ్ల క్రితమే చర్చించుకొన్నట్టు ఆ డాక్యుమెంట్ పేర్కొన్నది. మూడో ప్రపంచయుద్ధం వస్తే వైరస్‌ను జీవాయుధంగా ఉపయోగించుకోవాలని సూచించింది. డాక్యుమెంట్‌లోని వివరాలపై వీకెండ్ ఆస్ట్రేలియా మ్యాగజైన్ ఒక కథనాన్ని
ప్రచురించింది.
బీజింగ్, మే 9: ‘ప్రపంచం మీదకు చైనా వదిలిన జీవాయుధం కరోనా మహమ్మారి. లేకపోతే అన్ని దేశాల్లో మళ్లీమళ్లీ విజృంభించిన వైరస్ తన పుట్టినిైల్లెన చైనాలో మాత్రం ఒక్క నగరానికే ఎందుకు పరిమితమైంది. ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంటే చైనా ఒక్కటే ఎలా అంత వేగంగా వైరస్‌ను అడ్డుకోగలిగింది..’ కరోనా వ్యాప్తి మొదలైన కొన్ని రోజుల నుంచి ఇప్పటివరకు ప్రపంచం మదిని తొలిచేస్తున్న అనుమానం ఇది. ఈ అనుమానానికి బలం చేకూర్చే చైనా అధికారిక డాక్యుమెంట్ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. వీకెండ్ ఆస్ట్రేలియన్ అనే మ్యాగజైన్ దానిని బయటపెట్టింది. కథనం ప్రసారం చేసింది. ఈ కథనం ప్రకారం.. కరోనా వైరస్‌ను జీవాయుధంగా మార్చి ప్రపంచ దేశాలపై ప్రయోగిస్తే ఎలా ఉంటుందని ఆరేండ్ల క్రితం 2015లో చైనా శాస్త్రవేత్తలు చర్చించుకొన్నారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే కరోనా వైరస్‌ను జీవాయుధంగా ప్రయోగించాలని సూచించారు. జీవాయుధాల్లో కరోనా వైరస్‌ను ఓ కొత్త శకంగా వారు అభివర్ణించారు.
ప్రపంచం ఒకలా.. చైనా మరోలా
కరోనా మహమ్మారి వూహాన్‌లోని ఓ మార్కెట్లో బయటపడిందని చైనా తొలి నుంచి చెప్తున్నది. అందరూ నిజమనే నమ్మారు. అయితే చైనా చెప్పిన సమయం కన్నా ముందే కరోనా కేసులు వచ్చినట్టు బయటపడటం, వైరస్ గురించి చైనా ప్రపంచానికి ముందే సమాచారం ఇవ్వకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. వైరస్ పుట్టుకపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తునకు చైనా అనుమతినివ్వకపోవడం అనుమానాలను మరింత పెంచింది. అదే సమయంలో చైనా నుంచి పాకిన వైరస్ పశ్చిమదేశాల్లో మరణమృదంగం మోగిస్తుంటే చైనాలో కేసులు ఒక్కసారిగా పడిపోవడం అందరినీ విస్మయపర్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరితో ఆ దేశం ఆత్మరక్షణలో పడిన వేళ ప్రపంచంపై ఆధిపత్యం సాధించేందుకు చైనా ఈ జీవాయుధాన్ని వదిలిందని ఆరోపణలు ఉన్నాయి.
పచ్చి అబద్ధం: చైనా
కరోనా వైరస్‌ను జీవాయుధంగా మార్చాలని ఆరేండ్ల కింద చైనా మిలిటరీ శాస్త్రవేత్తలు చర్చించుకొన్నారంటూ ప్రసారమైన కథనాలు ‘పచ్చి అబద్ధం’ అని చైనా ఖండించింది. చైనాపై బురద జల్లడానికి అమెరికా అల్లిన కట్టుకథ అని ఆరోపించింది. ‘అమెరికా వందల సంఖ్యలో బయో ల్యాబ్‌లు నిర్వహిస్తున్నది. అంటే ఆ దేశం బయోవార్ కోసం పరిశోధనలు జరుపుతున్నదని భావించవచ్చా’ అని ప్రశ్నించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

