Silicon Valley Bank | లక్ష ఉద్యోగాలకు ముప్పు.. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూసివేతపై ఆందోళన
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ) మూసివేత పట్ల స్టార్టప్ సంస్థలు, ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ బ్యాంక్ మూసివేత ప్రభావం సుమారు 10 వేల స్టార్టప్‌లపై పడుతుందని, లక్ష ఉద్యోగులు లేఆఫ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని వై కాంబినేటర్ అనే సంస్థ పేర్కొంది.
- 10 వేల స్టార్టప్‌లపై ప్రభావం పడే అవకాశం
కాలిఫోర్నియా: అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) మూసివేత పట్ల స్టార్టప్ సంస్థలు, ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ బ్యాంక్ మూసివేత ప్రభావం సుమారు 10 వేల స్టార్టప్‌లపై పడుతుందని, లక్ష ఉద్యోగులు లేఆఫ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని వై కాంబినేటర్ అనే సంస్థ పేర్కొంది. ఈ సంస్థ భారత్‌లోని 200 స్టార్టప్‌లతో పాటు అమెరికాలో వేలాది స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అంశంపై వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ వై కాంబినేటర్ సంస్థ సీఈవో, ప్రెసిడెంట్ గార్రీ టాన్ అమెరికా ట్రెజరీ కార్యదర్శి జనెట్ యెల్లెన్, ఇతర ఉన్నతాధికారులకు లేఖ రాశారు.
ఈ లేఖపై 56 వేల ఉద్యోగులు కలిగిన 1,200 సంస్థల సీఈవోలు సైతం సంతకాలు చేశారు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌లో దాదాపు 37 వేల చిన్న వ్యాపార సంస్థలకు ఖాతాలు ఉన్నాయని, రెండున్నర లక్షల డాలర్ల డిపాజిట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ డబ్బులు వ్యాపారులకు అందుబాటులో లేకపోవడం వల్ల ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

