Paid Leave: కంపెనీ లక్కీ డ్రాలో 365 రోజుల పెయిడ్ లీవ్ గెలిచిన ఉద్యోగి
Paid Leave: మీ కంపెనీ కూడా ఇలాంటి ప్రైజ్ ఇవ్వాలని ఆశపడుతున్నారా. ఈ చైనా వ్యక్తిని చూస్తే అదే ఈర్ష్య కలుగుతుందేమో. వర్క్ టెన్షన్ నుంచి తప్పుకోవాలంటే.. ఇలాంటి లక్కీ డ్రాలు అవసరమే. 365 రోజుల పెయిడ్ లీవ్ గెలిచిన వ్యక్తి ఇప్పుడు చైనాలో ఓ హాట్ టాపిక్‌గా మారాడు.
షెన్జెన్: చైనాలోని ఓ కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆ కంపెనీ నిర్వహించిన లక్కీ డ్రాలో.. ఓ ఉద్యోగి 365 రోజుల పెయిడ్ లీవ్(Paide Leave)ను గెలిచాడు. ఈ ఘటన చైనాలోని షెన్జెన్(Shenzhen) నగరంలో జరిగింది. ప్రస్తుతం ఆ దేశ సోషల్ మీడియాలో ఆ వ్యక్తి వైరల్ అవుతున్నాడు. ఆ ఘటన గురించి వివరాలు తెలుసుకుందాం.
కరోనా వల్ల గత మూడేళ్ల నుంచి ఉద్యోగులు తీవ్ర వత్తిడిలో ఉన్నారు. ఆ స్ట్రెస్ నుంచి బయటపడేందుకు ఓ కంపెనీ తమ ఉద్యోగులకు డిన్నర్ పార్టీ ఇచ్చింది. ఆ పార్టీలో లక్కీ డ్రా నిర్వహించారు. ఆ డ్రాను చెన్ అనే ఉద్యోగి గెలుచుకున్నాడు. 365 రోజులు అంటే ఓ ఏడాది పాటు అతనికి పెయిడ్ లీవ్ ఇస్తున్నట్లు ఆ కంపెనీ చెప్పింది.
男子在公司年会抽到“365天带薪休假”奖项 pic.twitter.com/aOaSxgBAtO
— The Scarlet Flower (@niaoniaoqingya2) April 12, 2023
పెయిడ్ లీవ్ గెలిచిన వ్యక్తికి భారీ చెక్‌ను ప్రజెంట్ చేశారు. ఆ చెక్‌పై 365 డేస్ పెయిడ్ లీవ్ అని రాసి ఉంది. ఉద్యోగుల్లో వర్క్ ప్రెజర్ తగ్గించేందుకు ఆ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొందరికి ఒకటి లేదా రెండు రోజుల ఎక్స్ట్రా పెయిడ్ టైమ్ ఇచ్చారు. ప్రైజ్ గెలిచిన ఉద్యోగి పెయిడ్ లీవ్ వాడుకుంటాడా లేక డబ్బులు ఎన్‌క్యాష్ చేసుకుంటాడా అన్న విషయం ఇంకా తెలియదు.
ఇంత పెద్ద స్టంట్ చేసిన ఆ కంపెనీ వివరాలు బయటకు రాలేదు. కానీ ఆ వ్యక్తిపై మాత్రం అందరిలో అసూయ పెరుగుతోందని సోషల్ మీడియా కామెంట్లు చెబుతున్నాయి. ఒకవేళ ఆ ఉద్యోగి నిజంగా పెయిడ్ లీవ్ తీసుకుంటే, ఏడాది తర్వాత అతని పోస్టులో మరో వ్యక్తి ఉంటాడని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

