Donald Trump | ముదిరిన వివాదం.. ట్రంప్‌పై కోటి డాలర్లకు మరో పరువు నష్టం దావా వేసిన జీన్ కారోల్
Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ (E Jean Carroll) మధ్య వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలపై కారోల్ మరోసారి కోర్టు మెట్లెక్కింది. సోమవారం కొత్తగా ట్రంప్‌పై కోటి డాలర్లకు మరో పరువు నష్టం దావా వేసింది.
Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ (E Jean Carroll) మధ్య వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. తనను ట్రంప్ లైంగికంగా వేధించాడని కారోల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 1990లో మాన్‌హట్టన్ అవెన్యూలోని బెర్గ్ డార్ఫ్ గుడ్ మాన్ డిపార్ట్ మెంట్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని జీన్ కారోల్ ఆరోపించింది. తన గురించి అసభ్యకరంగా మాట్లాడి తన ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ పరువునష్టం దావా వేసింది.
కారోల్ ఆరోపణలపై రెండు వారాల క్రితం విచారణ జరిపిన న్యూయార్క్ జ్యూరీ (NewYork jury).. ట్రంప్‌ను దోషిగా పేర్కొంది. ఈ మేరకు ఆమెకు 50 లక్షల డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. కాగా, కారోల్ విషయంలో తాజాగా తన నోటిదురుసుతో ట్రంప్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. జ్యూరీ తీర్పు అనంతరం ట్రంప్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కారోల్ పరువుకు నష్టం కలిగించేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, అన్నీ కట్టుకథలే అంటూ కొట్టిపారేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై కారోల్ మరోసారి కోర్టు మెట్లెక్కింది. సోమవారం కొత్తగా ట్రంప్‌పై కోటి డాలర్లకు మరో పరువు నష్టం దావా వేసింది.
Also Read..
Road Accident | లోయలో పడిన క్రూజర్ వాహనం.. ఆరుగురు మృతి
Rajasthan | 7 ఏళ్ల బాలికను కొనుగోలు చేసిన 38 ఏళ్ల వ్యక్తి.. ఆపై ఏం చేశాడంటే..?
Ramabanam Movie | అప్పుడే ఓటీటీలోకి రామబాణం మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

