Ramabanam Movie | అప్పుడే ఓటీటీలోకి రామబాణం మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ramabanam Movie On OTT | గోపిచంద్ హిట్టు చూసి తొమ్మిదేళ్లయింది. 'లౌక్యం' తర్వాత ఇప్పటివరకు గోపిచంద్‌కు సరైన హిట్టే లేదు. మధ్యలో 'గౌతమ్ నందా', 'సీటీమార్' సినిమాలు మంచి టాకే తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయాయి.
Ramabanam Movie On OTT | గోపిచంద్ హిట్టు చూసి తొమ్మిదేళ్లయింది. ‘లౌక్యం’ తర్వాత ఇప్పటివరకు గోపిచంద్‌కు సరైన హిట్టే లేదు. మధ్యలో ‘గౌతమ్ నందా’, ‘సీటీమార్’ సినిమాలు మంచి టాకే తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయాయి. భారీ అంచనాలతో ఇటీవలే విడుదలైన ‘రామబాణం’ తొలిరోజే నెగెటీవ్ టాక్ తెచ్చుకుని పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. తన కెరీర్లో రెండు భారీ విజయాలిచ్చిన శ్రీవాస్ సైతం ఈ సారి గోపిను కాపాడలేకపోయాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
కాగా తాజాగా రామబాణం ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ దక్కించుకుంది. ఇక రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ డీల్ పూర్తయింది. ఈ కాంబోపై ఉన్న క్రేజ్‌తో సోనిలివ్ ఏకంగా రూ.8 కోట్లకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిందట. కాగా ఈ సినిమాను జూన్ 3 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
పీపుల్ మీడియా బ్యానర్‌పై వివేక్ కూచిబొట్ల ఈ సినిమాను నిర్మించాడు. గోపిచంద్‌కు జోడీగా డింపుల్ హయతి నటించింది. ఇక రిలీజ్‌కు ముందు మేకర్స్ చేసిన హడావిడితో ఈ సినిమాపై మంచి హైపే క్రియేట్ అయింది. పైగా పీపుల్ మీడియా నుంచి వస్తున్న సినిమా కావడంతో హిట్టు బొమ్మ అని అందరు అనుకున్నారు. తీరా రిలీజయ్యాక తెలిసిన కథలనే శ్రీవాస్ మిక్సీలో వేసి రుబ్బాడని విమర్శలు వచ్చాయి. ఈ సినిమాకు రూ.15 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫైనల్ రన్లో ఇందులో పావు వంతు షేర్‌ను కూడా సాధించలేక డిజాస్టర్‌గా మిగిలింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

