38 ఏండ్ల క్రితం 25 వేల మందిని పొట్టన బెట్టుకున్న కొలంబియాలోని నెవడొ డెల్ రూయిజ్ అగ్నిపర్వతం మరోసారి బద్ధలయ్యే ప్రమాదం ఉన్నది. దీంతో భారీ నష్టం సంభవించే అవకాశం ఉన్నది. కొన్ని వారాలు లేదా రోజుల్లోనే ఈ ప్రమాదం సంభవించవచ్చని కొలంబియా గనుల శాఖ ప్రకటించింది.
అధికారులు సిద్ధంగా ఉండాలని, ప్రజలు తాజా సమాచారాన్ని అనుసరించాలని స్పష్టం చేసింది.