బలప్రయోగానికీ వెనుకాడం.. తైవాన్ ఎప్పటికైనా చైనాలో కలవాల్సిందే
తైవాన్ను చైనాలో అంతర్భాగం చేసేందుకు అవసరమైతే బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు. శాంతియుత మార్గంలోనే పునరేకీకరణ జరుగాలని కోరుకొంటున్నామని, అదే సమయంలో బలప్రయోగం ఉండదని హామీ ఇవ్వబోనని తేల్చి చెప్పారు
- 2035 నాటికి అన్ని రంగాల్లో సూపర్ పవర్
- చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఉద్ఘాటన
- సీపీసీ 20వ నేషనల్ కాంగ్రెస్‌లో ప్రసంగం
బీజింగ్, అక్టోబర్ 16: తైవాన్ను చైనాలో అంతర్భాగం చేసేందుకు అవసరమైతే బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు. శాంతియుత మార్గంలోనే పునరేకీకరణ జరుగాలని కోరుకొంటున్నామని, అదే సమయంలో బలప్రయోగం ఉండదని హామీ ఇవ్వబోనని తేల్చి చెప్పారు. 2035 నాటికి ఆర్థిక, సైనిక శక్తిలో చైనాను సూపర్ పవర్‌గా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) 20 నేషనల్ కాంగ్రెస్‌లో జిన్‌పింగ్ ఆదివారం ప్రారంభోపన్యాసం చేశారు. చైనాను అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధితో ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు.
పునరేకీకరణ తప్పదు
తైవాన్ ఎప్పటికైనా చైనాలో కలువాల్సిందేనని జీ జిన్‌పింగ్ పునరుద్ఘాటించారు. ‘శాంతియుతంగానే పునరేకీకరణ (చైనాలో తైవాన్ను అంతర్భాగం చేయటం) సాధించేందుకు మేం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. కానీ, ఇందుకోసం బలప్రయోగానికి దిగబోమని మాత్రం హామీ ఇవ్వలేను’ అని పేర్కొన్నారు.
గాలివానను ఎదుర్కొనేందుకు సిద్ధం కండి
ప్రపంచంపై ఆధిపత్య పోరాటానికి సిద్ధమని జిన్‌పింగ్ పరోక్షంగా సంకేతాలిచ్చారు. అమెరికాతో వాణిజ్య యుద్ధం, తైవాన్‌కు అమెరికా మద్దతు నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ‘కష్టాలు ఎదుర్కోగలిగే తత్వాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. క్షేత్రస్థాయి ఆలోచనా విధానంతో శాంతి సమయంలో ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు సర్వదా సిద్ధం కావాలి. పెను గాలులు, మహాఅలలు, కుంభవృష్టిని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలి. మన భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతున్నది. అందుకోసం మనం మరింత దూరం ప్రయాణించాలి’ అని పేర్కొన్నారు. సైన్యాన్ని ఆధునీకరించే ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. గత ఐదేండ్లు అసాధారణంగా గడిచిపోయాయని జిన్‌పింగ్ అన్నారు. హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని విజయవంతంగా అణచివేశామని, కొవిడ్-19ను చైనాలో కట్టుదిట్టంగా కట్టడి చేశామని చెప్పుకొచ్చారు.
మీ బెదిరింపులకు భయపడం: తైవాన్
చైనా అధ్యక్షుడి ప్రకటనపై తైవాన్ కూడా దీటుగా స్పందించింది. సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని వదులుకొనేందుకు ఎట్టిపరిస్థితుల్లో తాము సిద్ధంగా లేమని తైవాన్ అధ్యక్ష భవనం ప్రకటించింది. ‘తైవాన్ నిర్ణయం సుస్పష్టం. సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను వదులుకొనేందుకు ఏమాత్రం సిద్ధంగా లేము. తైవాన్ జలసంధిలో రెండుదేశాల సైన్యాలు ముఖాముఖి తలపడటం ఎవరికీ మంచిది కాదు’ అని పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

