పాస్‌పోర్టులు, వీసాలు జారీ చేయనున్న చైనా
China passports కోవిడ్ ఆంక్షలను సడలిస్తున్న చైనా కీలక ప్రకటన చేసింది. సాధారణ వీసాలు, పాస్‌పోర్టులు జారీ చేయనున్నట్లు ఆ దేశం తెలిపింది. దాదాపు మూడేళ్ల పాటు తీవ్ర ఆంక్షల్లో ఉన్న చైనా.. ఇప్పుడిప్పుడే కొత్త నియమావళిని జారీ చేస్తోంది. వచ్చే నెలలో చైనా కొత్త సంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత సడ
బీజింగ్: కోవిడ్ ఆంక్షలను సడలిస్తున్న చైనా కీలక ప్రకటన చేసింది. సాధారణ వీసాలు, పాస్‌పోర్టులు జారీ చేయనున్నట్లు ఆ దేశం తెలిపింది. దాదాపు మూడేళ్ల పాటు తీవ్ర ఆంక్షల్లో ఉన్న చైనా.. ఇప్పుడిప్పుడే కొత్త నియమావళిని జారీ చేస్తోంది. వచ్చే నెలలో చైనా కొత్త సంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత సడలిస్తున్నారు. తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ యాంటీ వైరస్ చర్యలకు శ్రీకారం చుట్టారు.
చైనా సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక టూరిస్టు ప్రదేశాల్లో మళ్లీ కిటకిటలాడనున్నాయి. జనవరి 22వ తేదీ నుంచి చైనాలో చంద్రమాణ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అయితే ఆ సమయంలో మళ్లీ కోవిడ్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు భయాందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. విదేశీయులకు వీసాలు, స్వదేశీయులకు పాస్‌పోర్ట్‌లు ఇవ్వడం 2020లోనే చైనా ఆపేసింది. అయితే జనవరి 8వ తేదీ నుంచి పాస్‌పోర్టుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు జాతీయ ఇమ్మిగ్రేషన్ శాఖ తెలిపింది.
సాధారణ వీసాలు, రెసిడెన్స్ పర్మిట్ల కోసం కూడా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చైనా తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- Covid19
- Passports
- virus curbs
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

