Chang’e-6 Mission | చైనాకు పాక్‌పై ప్రేమ పెరుగుతున్నది. యాదాది దేశానికి చెందిన పేలోడ్‌ను స్పేస్‌లోకి తీసుకెళ్లనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. 2024లో జరగాల్సిన మూన్ మిషన్‌లో పాక్‌కు చెందిన పేలోడ్‌ను సైతం తీసుకెళ్లామని తెలిపింది. అంతరిక్ష రంగంలో పాక్‌తో సహకారాన్ని పెంచుకుంటున్నట్లు చైనా అంతరిక్ష సంస్థ తెలిపింది. లూనార్ మిషన్‌లో భాగంగా చైనా శాంపిల్స్ తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నది. చంద్రుడి సౌత్ పోల్లోని ఐట్కెన్ బేసిన్ వద్ద ల్యాండ్ చేయబోతున్నది.
అలాగే.. ఛాంగ్ మిషన్‌లో పలు దేశాలకు చెందిన పేలోడ్లను సైతం మోసుకెళ్లనున్నది. ఫ్రాన్స్‌కు చెందిన డోర్న్ రాడాన్ డిటెక్షన్ పరికరం, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అయాన్ డిటెక్టర్, ఇటలీ లేజర్ రెట్రో రిఫ్లెక్టర్, పాకిస్తాన్‌కు చెందిన క్యూబ్‌శాట్‌ను సైతం మిషన్‌లో తీసుకెళ్లనున్నది. క్యూబ్‌శాట్ పాక్‌కు చెందిన చిన్న ఉపగ్రహం. ఇదిలా ఉండగా.. 2017లో పర్యావరణ అనుకూల విత్తనాలపై పరిశోధనల కోసం పాక్.. చైనా అంతిరక్ష కేంద్రం టియాంగాంగ్‌కు విత్తనాలు సైతం పంపింది.