భారత సరిహద్దులకు చైనా బుల్లెట్ రైలు

బీజింగ్ : టిబెట్లో చైనా తొలి ఎలక్ట్రిఫైడ్ బుల్లెట్ రైలును శుక్రవారం ప్రారంభించింది. టిబెట్ రాజధాని లాసా, నింగ్చి నగరాల మధ్య ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. నింగ్చి నగరం భారత్లోని అరుణాచల్ ప్రదేశ్కు అత్యంత సమీపాన ఉన్నది. 435.5 కిలోమీటర్ల ఈ రైలు మార్గం నిర్మాణ పనులను 2014లోనే చైనా మొదలు పెట్టింది. టిబెట్లో పూర్తిస్థాయిలో విద్యుదీకరించిన మొదటి రైల్వే లైన్ ఇదే. అలాగే ఆ ప్రాంతంలో చైనా ప్రారంభించిన రెండో రైల్వే లైన్ ఇది. ఈ రైలు మార్గంతో సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డూ నుంచి లాసా మధ్య ప్రయాణ సమయం 48 గంటల నుంచి 13 గంటలకు తగ్గనుందని చైనా అధికారిక మీడియా తెలిపింది. కాగా, సరిహద్దుల్లో స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో ఈ రైలు మార్గం కీలక పాత్ర పోషిస్తుందని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గతంలో పేర్కొన్నారు. అభివృద్ధి పనుల ముసుగులో సరిహద్దుల్లోకి తమ బలగాలను వేగంగా తరలించేందుకే చైనా ఈ రైలు మార్గాన్ని నెలకొల్పిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

