తైవాన్‌పై 71 యుద్ధ విమానాలతో చైనా బలప్రదర్శన
China warplanes తైవాన్‌పై చైనా బలప్రదర్శన కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో సుమారు 71 యుద్ధ విమానాలతో చైనా సైనిక సత్తా చాటింది. ఏడు భారీ నౌకలను కూడా తైవాన్ దిశగా చైనా మళ్లించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తైవాన్ రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొన్నది. అమెరికా రక్షణ బిల్లులో తైవాన్‌కు కొన్ని కేటాయింపులు చేసిన నేపథ్యం
తైపి: తైవాన్‌పై చైనా బలప్రదర్శన కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో సుమారు 71 యుద్ధ విమానాలతో చైనా సైనిక సత్తా చాటింది. ఏడు భారీ నౌకలను కూడా తైవాన్ దిశగా చైనా మళ్లించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తైవాన్ రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొన్నది. అమెరికా రక్షణ బిల్లులో తైవాన్‌కు కొన్ని కేటాయింపులు చేసిన నేపథ్యంలో ఆ దేశంపై చైనా ఆగ్రహంగా ఉంది. తైవాన్‌పై చైనా సైనిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
తైవాన్ తమ భూభాగమే అని చైనా వాదిస్తున్న విషయం తెలిసిందే. తైవాన్ జల సంధి వరకు సుమారు 47 చైనా రక్షణశాఖ విమానాలు వచ్చినట్లు తైవాన్ రక్షణశాఖ తెలిపింది. జే-16 ఫైటర్ జెట్స్ 18, జే-1 ఫైటర్ విమానాలు 11, ఆరు సుఖోయ్-30 ఫైటర్ విమానాలతో పాటు డ్రోన్లను కూడా తైవాన్‌పైకి చైనా పంపినట్లు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

