రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి తాము సిద్ధమని చైనా కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య ఏర్పడ్డ సంక్షోభానికి తెర దించేందుకు తాము సిద్ధమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రకటించారు. విదేశాంగ శాఖ వార్షిక రిపోర్టును వెల్లడించే క్రమంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. రష్యా ఉక్రెయిన్ మధ్య బంధాలు చాలా బలంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇరు దేశాలు పరస్పర సహకారం ఇచ్చి పుచ్చుకోవడానికి కూడా విశాలమైన అవకాశాలున్నాయన్నారు. అత్యవసరమైతే ఉక్రెయిన్ రష్యా మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని, అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేసుందుకు తాము సుముఖంగానే వున్నామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య చర్చల విషయంలో గానీ, శాంతియుత వాతావరణం నెలకొనే విషయంలో గానీ.. నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి తాము సిద్ధమని వాంగ్‌యీ ప్రకటించారు.