Li Qiang: చైనా కొత్త ప్రధాని లీ కుయాంగ్
Li Qiang: లీ కుయాంగ్ ఇప్పుడు చైనాకు కొత్త ప్రధాని. ఆయన పేరును జీ జిన్పింత్ ప్రతిపాదించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు కుయాంగ్ తెలిపారు.
బీజింగ్: చైనా కొత్త ప్రధానిగా లీ కుయాంగ్(Li Qiang) ఎన్నికయ్యారు. దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్(Xi Jinping).. లీ కుయాంగ్ పేరును ప్రతిపాదించారు. గతంలో ఆయన కమ్యూనిస్టు పార్టీ నేతగా చేశారు. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాల్లో జీ జిన్‌పింగ్ ఈ ప్రకటన చేశారు. ఆ సమావేశంలో పాల్గొన్న సుమారు 2900 మంది ప్రతినిధులు దాదాపు లీ కుయాంగ్కే ఓటేశారు. 63 ఏళ్ల కియాంగ్.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు సన్నిహితుడు. అయితే దేశ ఆర్ధిక వ్యవస్థ(Economy)ను సరిచేసే బాధ్యతల్ని లీ కుయాంగ్ అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
పార్లమెంట్ సమావేశాల్లో బ్యాలెట్లు వేస్తున్న సమయంలో రిపోర్టర్లను అనుమతించలేదు. లీకి మొత్తం 2936 ఓట్లు పోలయ్యాయి. మూడు మంది ప్రతినిధులు(Representatives) మాత్రం వ్యతిరేకంగా ఓటేశారు. మరో 8 మందికి ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఆయన రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేశారు. దేశ నిర్మాణం కోసం కృషి చేయనున్నట్లు లీ కుయాంగ్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

