చైనాలో కరోనాతో రోజుకు 9 వేల మంది మృతి!
China | చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ లక్షల సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనప్పటికీ.. దేశంలో వేల సంఖ్యలో జనాలు మృత్యువాత
బీజింగ్: చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ లక్షల సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనప్పటికీ.. దేశంలో వేల సంఖ్యలో జనాలు మృత్యువాత పడుతున్నారని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. బ్రిటన్కు చెందిన ఎయిర్ఫినిటీ (Airfinity) అనే పరిశోధనా సంస్థ డ్రాగన్ కంట్రీలో రోజుకు సుమారు 9 వేల మంది కోవిడ్తో మరణిస్తున్నారని తన నివేదికలో పేర్కొన్నది. కరోనా ఆంక్షలు ఎత్తివేయకముందు నుంచి కొన్ని ప్రావిన్స్లలో కరోనా తీవ్రతను రికార్డు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఒక్క డిసెంబర్ నేలలో కోటీ 86 లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపింది. వారిలో సుమారు లక్ష మంది మరణించి ఉంటారని పేర్కొన్నది. జనవరి మధ్య నాటికి రోజుకు 37 లక్షల కేసులు నమోదవుతాయని హెచ్చరించింది. నెలాఖరుకు వైరస్ 5 లక్షల 84 వేల మంది చనిపోయే అవకాశం ఉందని పేర్కొన్నది. కాగా, డిసెంబర్ 30న దేశంలో ఒక్కరు మాత్రమే మరణించారని ప్రభుత్వం ప్రకటించడం విశేషం.
అయితే వాస్తవిక గణాంకాలను వెల్లడించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చైనా ప్రభుత్వాన్ని కోరింది. శంలో కోవిడ్ పరిస్థితులపై నిర్ధిష్టమైన సమాచారాన్ని క్రమంతప్పకుండా అందించాలని సూచించింది. వైరస్ బారినపడి దవాఖానల్లో చేరిన వారి సంఖ్య, జెనెటిక్ సీక్వెన్సింగ్, కరోనా మరణాలు, టీకాలపై డాటాను పంచుకోవాలని చైనా ఆరోగ్య అధికారులకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

