100 జీబీపీఎస్ వేగంతో 6జీ చైనా సంస్థ సరికొత్త రికార్డు
ఆరో తరం వైర్లెస్ సమాచార సాంకేతికత 6జీలో చైనాకు చెందిన చాంగ్ గువాంగ్ శాటిలైట్ టెక్నాలజీ సంస్థ సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ సంస్థ అంతరిక్షం నుంచి భూమిపైకి లేజర్ ట్రాన్స్‌మిషన్‌తో సెకనుకు 100 గిగాబిట్ల(జీబీపీఎస్) డాటాను పంపించగలిగినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది.
బీజింగ్: ఆరో తరం వైర్లెస్ సమాచార సాంకేతికత 6జీలో చైనాకు చెందిన చాంగ్ గువాంగ్ శాటిలైట్ టెక్నాలజీ సంస్థ సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ సంస్థ అంతరిక్షం నుంచి భూమిపైకి లేజర్ ట్రాన్స్‌మిషన్‌తో సెకనుకు 100 గిగాబిట్ల(జీబీపీఎస్) డాటాను పంపించగలిగినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. చాంగ్ గువాంగ్ అనేది వాణిజ్య ఉపగ్రహ సంస్థ.
అంతరిక్షంలోని తన జిలిన్-1 ఉపగ్రహం నుంచి భూమిపైన ఒక ట్రక్‌లో ఉన్న కేంద్రానికి డాటాను పంపించగలిగింది. ఇంతకుముందు ఈ సంస్థ అందుకున్న వేగం కంటే ఇది దాదాపు 10 రెట్లు అధికం. 100 జీబీపీఎస్ వేగం అంటే ఒక సెకనుకు దాదాపు 10 సినిమాలను పంపించడంతో సమానమని ఈ సంస్థ ప్రతినిధి వాంగ్ హాంఘాంగ్ తెలిపారు. ఈ సాంకేతికతను ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ కూడా అభివృద్ధి చేసినట్టు కథనాలు ఉన్నప్పటికీ ఎంత వేగాన్ని అందుకున్నదనే అంశంపై స్పష్టత లేదు. ఇంతకుముందు ఎంఐటీ, నాసా కలిసి లేజర్ ట్రాన్స్‌మిషన్‌తో 100 జీబీపీఎస్ వేగాన్ని అందుకున్నట్టు ప్రకటించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
Brazil President | నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి లూలా డ సిల్వా.. ప్లావియో బోల్సోనారోపై ఘన విజయం..!
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

