bird flu | మనిషిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు.. చిలీలో ఆందోళన రేపుతున్న తొలి కేసు
bird flu | 53 ఏళ్ల వ్యక్తికి బర్డ్ ఫ్లూ (bird flu) సోకినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ రోగికి తీవ్రమైన ఇన్ఫ్లూఎంజా లక్షణాలున్నట్లు వెల్లడించింది. అయితే అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వివరించింది.
శాంటియాగో: మనిషిలో బర్డ్ ఫ్లూ (bird flu) లక్షణాలు కనిపించాయి. చిలీలో తొలి కేసు నమోదు కావడం ఆందోళన రేపుతున్నది. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలిపింది. 53 ఏళ్ల వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు పేర్కొంది. ఆ రోగికి తీవ్రమైన ఇన్ఫ్లూఎంజా లక్షణాలున్నట్లు వెల్లడించింది. అయితే అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వివరించింది. దేశంలో తొలిసారి మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్ ఎలా వ్యాపించిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ వైరస్ పక్షులు లేదా సముద్రపు క్షీరదాల నుంచి మానవులకు సంక్రమించి ఉంటుందని చిలీ ఆరోగ్య అధికారులు అనుమానిస్తున్నారు. అయితే మానవుల నుంచి మానవులకు బర్డ్ ఫ్లూ వ్యాపించడాన్ని ఇప్పటి వరకు గుర్తించలేదన్నారు.
కాగా, బర్డ్ ఫ్లూ సోకిన రోగితో కాంటాక్ట్ అయిన ఇతర వ్యక్తులను కూడా ట్రాక్ చేస్తున్నట్లు చిలీ ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది చివరిలో అటవీ జంతువుల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనట్లు పేర్కొంది. దీంతో పౌల్ట్రీ ఎగుమతులను నిలిపివేసినట్లు వెల్లడించింది. మరోవైపు అర్జెంటీనా సహా 14 లాటిన్ అమెరికా దేశాలలో కూడా మనుషుల్లో బర్డ్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఈక్వెడార్‌కు చెందిన 9 ఏళ్ల బాలికలో మానవ సంక్రమణ బర్డ్ ఫ్లూ కేసును నిర్ధారించారు.
Also Read:
Philippine Ferry: ఫిలిప్పీన్స్ షిప్లో అగ్నిప్రమాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య
H-1B Visa: హెచ్-1బీ వీసా జీవిత భాగస్వాములకు గుడ్‌న్యూస్ చెప్పిన అమెరికా
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Bird Flu
- Chile
- Human Case
- symptoms
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

