H-1B Visa: హెచ్-1బీ వీసా జీవిత భాగస్వాములకు గుడ్‌న్యూస్ చెప్పిన అమెరికా
H-1B Visa: H-1B వీసా ఉన్న వారికి ఇది శుభవార్త. ఆ వీసా ఉన్న జీవిత భాగస్వాములు.. అమెరికాలో ఉద్యోగం చేసుకునే వీలు కల్పించారు. దీనికి సంబంధించిన జడ్జి తాన్యా తాజాగా ఓ కేసులో ఈ ఆదేశాలు చేశారు.
వాషింగ్టన్: అమెరికాలో హెచ్-1బీ వీసా(H-1B Visa) ఉన్న భారతీయులకు ఇదో గుడ్‌న్యూస్. ఆ వీసా ఉన్న వారి జీవితభాగస్వాములు(spouses) కూడా ఉద్యోగులు చేసుకోవచ్చు అని తాజాగా ఓ న్యాయమూర్తి తీర్పును ఇచ్చారు. ఒకరకంగా ఈ ఆదేశాలు భారతీయ టెకీలకు భారీ ఊరట కల్పించింది. అమెరికాలో ఉన్న టెక్నాలజీ కంపెనీలు చాలా వరకు హెచ్-1బీ వీసాలను జారీ చేస్తాయి. ఇండియా(india), చైనా(china) లాంటి దేశాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులపై ఆ కంపెనీలు ఆధారపడుతాయి.
అయితే గతంలో ఒబామా ప్రభుత్వం(Obama government) జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే సంస్థ కోర్టును ఆశ్రయించింది. హెచ్-1బీ వీసా ఉన్న భాగస్వాములు కూడా ఉద్యోగం చేసుకోవచ్చు అన్న నిబంధన ఎత్తివేయాలని ఆ సంస్థ కోరింది. అయితే ఆ పిటిషన్‌ను అమెరికా జిల్లా జడ్జి తాన్యా చుక్టన్(US District Judge Tanya Chukkan) తిరస్కరించారు.
హెచ్-1బీ వర్కర్ల వల్ల తమకు ఉద్యోగాలు రావడం లేదని సేవ్ జాబ్స్ యూఎస్ఏ(Save Jobs USA) ఆరోపిస్తున్నది. కానీ ఆ సంస్థ వేసిన పిటీషన్‌ను మాత్రం అమెజాన్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. హెచ్-1బీ వీసాలు ఉన్న జీవిత భాగస్వాముల్లో సుమారు లక్ష మందికి అమెరికా సర్కారు వర్క్ పర్మిట్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

