శాంటియాగో: ఎయిర్‌పోర్ట్‌లోని కన్వేయర్ బెల్ట్‌పై ఒక బాలుడు సరదాగా రైడ్ చేశాడు. (Child Rides On Conveyor Belt) గమనించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ బాలుడి వద్దకు చేరుకుని సురక్షితంగా బయటకు తెచ్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చిలీ దేశ రాజధాని శాంటియాగోలో ఈ సంఘటన జరిగింది. గత గురువారం శాంటియాగో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగేజ్ తరలించే కన్వేయర్ బెల్ట్‌పైకి ఒక బాలుడు చేరుకున్నాడు. కదులుతున్న దానిపై కూర్చొని సరదాగా రైడ్ చేశాడు.
కాగా, ఎయిర్పోర్ట్ సిబ్బంది సీసీటీవీల ద్వారా ఈ విషయాన్ని గమనించారు. వారు వెంటనే అప్రమత్తమయ్యారు. కన్వేయర్ బెల్ట్ కదలికను ఆపివేశారు. ఇద్దరు సిబ్బంది ఆ బాలుడి వద్దకు చేరుకున్నారు. ఆ చిన్నారిని సురక్షితంగా బయటకు తెచ్చారు.
మరోవైపు ఈ వ్యవస్థను సరిగా వినియోగించని ఎయిర్‌లైన్ సిబ్బంది తీరుపై ఎయిర్పోర్ట్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Parents lose sight of their child at the airport pic.twitter.com/1phO6vwbma
— Crazy Clips (@crazyclipsonly) November 23, 2023