బోస్టన్: విటమిన్ డీ సప్లిమెంట్స్‌ను అధికంగా తీసుకొంటే ప్రీ డయాబెటిస్ ఉన్న వయోజనుల్లో టైప్ 2 డయాబెటిస్ ముప్పు తగ్గుతున్నట్టు అమెరికా పరిశోధకుల అధ్యయనంలో తేలింది. పరిశోధకులు విటమిన్ డీ సప్లిమెంట్ ప్రభావంపై మూడు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ప్రీ డయాబెటిస్తో బాధపడుతూ విటమిన్ డీ సప్లిమెంట్ తీసుకొన్న కేవలం 22.7 శాతం మందిలో మాత్రమే టైప్ 2 డయాబెటిస్ కనిపించిందని, ఈ రిస్క్ 15 శాతం తగ్గిందని తేల్చారు. ఎక్కువ మోతాదులో విటమిన్ డీ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఇతర దుష్ప్రభావాలు కూడా ఉంటాయన్నారు.