Sam Altman | చాట్‌జీటీపీ సృష్టికర్త శామ్ ఆల్ట్మన్పై ఓపెన్ఏఐ వేటు..
ఇంటరాక్టివ్ చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT)ని సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్‌కు (Sam Altman) ఓపెన్ఏఐ షాకిచ్చింది. ఆల్ట్‌మన్‌ను సంస్థ సీఈవో (CEO) పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
వాషింగ్టన్: ఇంటరాక్టివ్ చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT)ని సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్‌కు (Sam Altman) ఓపెన్ఏఐ షాకిచ్చింది. ఆల్ట్‌మన్‌ను సంస్థ సీఈవో (CEO) పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయనపై విశ్వాసం లేకపోవడమే వేటుకు కారణమని ప్రకటించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. శామ్ స్థానంలో తాత్కాలికంగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న మిరా మురాటీని (Mira Murati) సీఈవోగా నియమించింది. శుక్రవారం సమావేశమైన ఓపెన్ఏఐ (OpenAI) బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.
బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో ఆల్ట్‌మెన్ నిజాయితీ పాటించడం లేదని, సరైన సమాచారం పంచుకోవడం లేదని ఓపెన్ఏఐ వెల్లడించింది. బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నారని పేర్కొంది. ఓపెన్ఏఐకి నాయకత్వం వహించే అతని సామర్థ్యంపై తమకు ఏమాత్రం నమ్మకం లేదని తెలిపింది. కాగా, సీఈవో బాధ్యతల నుంచి తనను తొలగించడం పట్ల ఆల్ట్‌మెన్ స్పందించారు. సంస్థలో పనిచేయడాన్ని తాను ఎంతో ఇష్టపడ్డానని చెప్పారు. వ్యక్తిగతంగా తాను మారడానికి, ప్రపంచాన్ని కొంచెం మార్చిందని నమ్ముతానని తెలిపారు. ఎంతోమంది ప్రతిభావంతులతో కలిసి పనిచేయడాన్ని ఇష్టపడ్డానని చెప్పారు. తర్వాత ఏం జరుగుతుందనే దాని గురించి మరింత చెప్పాల్సి ఉంటుందన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే చాట్‌జీపీటీని మైక్రోసాఫ్ట్ (Microsoft) ఆర్థిక మద్దతు కలిగిన ఓపెన్ఏఐ 2015లో అభివృద్ధి చేసింది. స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్‌తో కలిసి శామ్ ఆల్ట్‌మెన్ దీనిని రూపొందించారు. అయితే 2018లో ఈ కంపెనీ నుంచి మస్క్ తప్పుకున్నారు. కృత్రిమ మేధతో ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం ఇచ్చే చాట్‌జీపీటీ అనూహ్య విజయం టెక్ ప్రపంచంలో ఏఐ టెక్నాలజీపై హాట్ డిబేట్‌కు తెరలేపింది. లాంఛ్ అయిన రెండునెలల్లోనే చాట్‌జీపీటీ 10 కోట్ల యూజర్లను చేరుకుంది. ఏఐ ట్రెండ్‌ను అందిపుచ్చుకునేందుకు పలు టెక్ కంపెనీలు తమ సొంత ఏఐ మోడల్స్‌ను డెవపల్ చేసేందుకు బారులుతీరాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

