టెహ్రాన్: తమ సుప్రీం లీడర్‌ను అవమానించేలా కార్టూన్ వేసినందుకు ఫ్రాన్స్‌పై గుర్రుగా ఉన్న ఇరాన్.. ఆ దేశానికి చెందిన ఓ సంస్థను మూసేసింది. ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రెంచ్ ఇన్‌స్టిట్ ఫర్ రీసెర్చ్ గత కొన్ని దశాబ్దాలుగా ఇరాన్లో సేవలందిస్తున్నది. అయితే ఫ్రెంచ్ మ్యాగజైన్ చార్లీ హెబ్డే.. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమనీను అవమానించేలా కార్టూన్ ముద్రించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఇరాన్ ప్రభుత్వం తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫ్రాన్స్‌ను హెచ్చరించింది. ఇందులో భాగంగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్పై నిషేధం విధించింది.
భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ముస్లిం దేశాల పవిత్రతను అవమానపరిచేందుకు ఫ్రాన్స్‌కు ఎలాంటి అధికారం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నసీర్ కన్సాయ్ అన్నారు. కాగా, గత కొన్ని నెలలుగా ఇరాన్లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు మద్దతుగా డిసెంబర్ నెలలో నిర్వహించిన పోటీల్లో భాగంగానే ఈ కార్టూన్లు ప్రింట్ చేశామని చార్లీ హెబ్డే మ్యాగజైన్ తెలిపింది.