Bangladesh | బంగ్లాదేశ్‌లో కదంతొక్కిన హిందువులు.. జైశ్రీరామ్ నినాదాలతో ఢాకాలో నిరసన.. ఎందుకంటే
Bangladesh : మైనారిటీల హక్కులను కాలరాస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి హిందువులు కదంతొక్కారు. రాముడి విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శుక్రవారం రాత్రి భారీ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది హిందువులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Bangladesh : మైనారిటీల హక్కులను కాలరాస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి హిందువులు కదంతొక్కారు. రాముడి విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శుక్రవారం రాత్రి భారీ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది హిందువులు, విద్యార్థులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్, గైబంధ జిల్లాలోని పలాష్బరి కాంప్లెక్స్ దేవాలయ ప్రాంగణంలో 81 అడుగుల రాముడి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. శ్రీశ్రీ రాధా గోవింద దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఈ విగ్రహం నిర్మాణం జరుగుతోంది. రాముడి విగ్రహంతోపాటు కృష్ణుడు, శివుడి విగ్రహాల్ని కూడా నిర్మిస్తున్నారు. ఇందులో రాముడి విగ్రహ నిర్మాణం అతిపెద్దది.
ఈ నిర్మాణం దాదాపు 80 శాతం పూర్తైంది. అయితే, రాముడి విగ్రహాన్ని నిర్మించవద్దని అక్కడి ముస్లిం సంఘాలు, మత గురువులు హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం ఈ విగ్రహ నిర్మాణాన్ని నిలిపివేసింది. అలాగే, రాముడి విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఇటీవల కొన్ని ముస్లిం సంఘాలు నిరసన చేపట్టాయి. దీనిలో భాగంగా రాముడి చిత్ర పటాన్ని అవమానపరిచాయి. విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడాన్ని, రాముడి చిత్ర పటాన్ని అవమానించడాన్ని నిరసిస్తూ ఢాకాలో హిందువులు శుక్రవారం రాత్రిపూట కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. జైశ్రీరామ్ నినాదాలు చేశారు. ఢాకాలోని షాబాగ్ ఇంటర్సెక్షన్ నుంచి నేషనల్ ప్రెస్ క్లబ్ వరకు ర్యాలీ చేశారు. అనేక హిందూ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇందులో పాల్గొన్నాయి. ఢాకాలోని రిపోర్టర్స్ యునిటీ బిల్డింగ్ వద్ద కూడా మరికొందరు నిరసన చేపట్టారు. విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, రాముడిని అవమానించి వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ.. పోలీసులు ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుల్ని మూడు రోజుల్లోగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
లేకుంటే దేశవ్యాప్తంగా మరిన్ని ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అలాగే, విగ్రహ ఏర్పాటు పూర్తి చేయకపోతే దేశంలోని అన్ని జిల్లాల్లో రాముడి ఆలయాలు కడతామని కూడా హెచ్చరించారు. అయితే, ఈ నిరసనల్ని కొన్నిచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంత గందరగోళం తలెత్తింది. మరోవైపు కొత్తగా ఏర్పడ్డ తారిక్ రెహమాన్ నాయకత్వంలోని ప్రభుత్వంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీలకు రక్షణ లేకుండా పోతోందని హిందూ సంఘాలు సహా పలు మైనారిటీ సంఘాలు విమర్శిస్తున్నాయి. ముస్లిం మెజారిటీ దేశం కావడంతో ఇతర మతస్తులపై తరచూ దాడులు జరుగుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

