కరోనా మార్గదర్శకాలను ఆగస్ట్ 31 వరకు పొడిగించిన కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా నియంత్రణకు గతంలో జారీ చేసిన మార్గదర్శకాల అమలును ఆగస్ట్ 31 వరకు కేంద్రం ప్రభుత్వం పొడిగించింది. కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. కరోనా కేసులు తగ్గినప్పటికీ అప్పుడే ఆత్మసంతృప్తి చెందవద్దని సూచించింది.
కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల, ఆర్ ఫ్యాక్టర్ ఒకటి కన్నా ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. వరుస పండుగల నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో కరోనా మార్గదర్శకాలు, నిబంధనలను ప్రజలు పాటించేలా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలిపింది. కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షల సడలింపుపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
కోవిడ్ -19 సమర్థవంతమైన నిర్వహణ కోసం ఐదు అంచెల వ్యూహమైన టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకా-కరోనా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంపై నిరంతరం దృష్టి ఉండాలని సూచించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు బుధవారం లేఖలు పంపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

