ఒట్టావా: కెనడాలో రికార్డు స్థాయిలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అధికారిక డేటా ప్రకారం ఈ ఏడాది మూడవ క్వార్టర్లో ఆ సంఖ్య 9,12,600కి చేరింది. కరోనా మహమ్మారి వల్ల కెనడాలో కార్మికుల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దేశ ఆర్థిక వృద్ధి కోసం కెనడా భారీ స్థాయిలో ఇమ్మిగ్రేషన్ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. సంతానోత్పత్తి రేటు తగ్గడం వల్ల కూడా ఆ దేశం ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంది. 2019లో అన్ని రంగాలతో కలిపి దేశంలో సుమారు 349,700 ఉద్యోగాలు ఖాళీ ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. 2019 మూడవ క్వార్టర్ నుంచి 2021 మూడవ క్వార్టర్ మధ్యలో సుమారు 18 భారీ పరిశ్రమ రంగాల్లో ఉద్యోగ ఖాళీలు పెరిగినట్లు డేటా చెబుతోంది. అగ్రికల్చర్, ఫారెస్ట్రి, ఫిషింగ్, హంటింగ్, రియల్ ఎస్టేట్ రంగాల్లో మాత్రమే పెద్దగా ఖాళీలు ఏర్పడలేదు. హెల్త్ కేర్, కన్స్ట్రక్షన్, అకామిడేషన్ అండ్ ఫుడ్, రిటేల్ ట్రేడ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఖాళీలు మాత్రం శరవేగంగా ఏర్పడుతున్నాయి. అయితే తక్కువ జీతాలు ఉండే రంగాల్లో మాత్రమే ఎక్కువ స్థాయిలో ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది.