టొరంటో, జూన్ 1: ఇతర దేశాల నుంచి నిపుణులైన ఉద్యోగార్థులను ఆహ్వానించడం కోసం కెనడా తన ఇమ్మిగ్రేషన్ విధానంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఫ్రెంచ్ భాషలో పట్టున్న వారు, ఆరోగ్య రంగం, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణిత రంగాల నిపుణులతో పాటు కార్పెంటర్లు, ప్లంబర్లు, ట్రాన్స్పోర్ట్, వ్యవసాయ రంగాల్లో అనుభవం ఉన్న వారు కెనడా శాశ్వత నివాసితులుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వనున్నది.