స్మార్ట్‌ఫోన్‌తో కరోనా నిర్ధారణ పరీక్షలు..!
Corona test with Smart Phone: స్మార్ట్‌ఫోన్ సాయంతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా కెనాడా శాస్త్రవేత్తలు నూతన విధానాన్ని కనిపెట్టారు.

టొరంటో: స్మార్ట్‌ఫోన్ సాయంతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా కెనాడా శాస్త్రవేత్తలు నూతన విధానాన్ని కనిపెట్టారు. కొవిడ్-19 పరీక్షను చాలా సులువుగా నిర్వహించడంతోపాటు బాధితుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించేలా ఆ విధానం ఉన్నది. స్మార్ట్‌ఫోన్ కెమెరా సాయంతో చేపట్టే ఈ పరీక్ష వల్ల కరోనా వైరస్‌ను వేగంగా గుర్తించవచ్చు. సాధారణంగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో నమూనాలను సేకరించడం, వాటిని ల్యాబ్‌కు పంపడం, పరీక్ష నిర్వహించడం, ఫలితాన్ని తెలియజేయడం వంటి అనేక దశలు ఉంటాయి.
అందువల్ల ఫలితం రావడానికి చాలా సమయం పడుతున్నది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ ఆధారిత క్వాంటమ్ బార్కోడ్ సీరోలాజికల్ ఆనే సాధనాన్ని టొరంటో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందుకోసం క్వాంటమ్ డాట్ బార్‌కోడ్‌తో కూడిన సూక్ష్మ పూసలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. అలాగే రోగి రక్తంలో కొవిడ్-19 యాంటిజెన్‌కు సంబంధించిన యాంటీబాడీలను గాలించేందుకు సెకండరీ లేబుల్‌ను రూపొందించారు.
రక్త నమూనాలో యాంటీబాడీలు ఉంటే సూక్ష్మపూస రంగు మారిపోతుంది. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్ కెమెరాతో ఈ పూసను క్లిక్‌మనిపించాలి. ఫోన్లోని ప్రత్యేక యాప్ ఈ ఫొటోను ప్రాసెస్ చేసి, పూసలో చోటుచేసుకున్న మార్పులను విశ్లేషిస్తుంది. అంతిమంగా ఈ డేటా సమగ్ర మదింపు జరిపి, ఆ వివరాలను తెలియజేస్తుంది. వాటిని వైద్య నిపుణులకూ పంపుతుంది. రక్త నమూనాలోని కీలక బయోమార్కర్లు స్వల్ప స్థాయిలో ఉన్నా ఇది గుర్తిస్తుందని పరిశోధకులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

