కారుతున్న రక్తాన్ని చిటికెలో ఆపొచ్చు

ఒట్టావా, జూలై 18: రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందినవారిలో 40 శాతం మంది మరణానికి తీవ్ర రక్తస్రావమే కారణమని నివేదికలు చెబుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే రక్తస్రావాన్ని ఆపగలిగితే ప్రతి 10 మంది బాధితుల్లో నలుగురి నుంచి ఐదుగురిని రక్షించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగాక.. కేవలం 20-45 సెకండ్లలో తీవ్ర రక్తస్రావాన్ని సైతం నిలువరించగల జిగురులాంటి ఔషధాన్ని కెనడా పరిశోధకులు అభివృద్ధి చేశారు. అత్యంత ప్రమాదకరమైన లాన్స్‌హెడ్ జాతి పాముల విషం నుంచి ఈ ఔషధాన్ని తయారుచేయడం గమనార్హం. ‘సూపర్ గ్లూ’గా పిలుస్తున్న ఈ ఔషధాన్ని గాయంపై వేసి, లేజర్ లైట్ లేదా సెల్‌ఫోన్‌లోని టార్చ్‌లైట్ వెలుతురును ప్రసరించేలా చేస్తే, రక్తస్రావాన్ని అడ్డుకునే కణజాలాన్ని ఉత్తేజితం చేస్తుందని పరిశోధకులు తెలిపారు. లాన్స్‌హెడ్ పాముల విషంలో రక్తాన్ని గడ్డకట్టించే రెప్టలైజ్ (బ్యాట్రోక్సోబిన్) ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

