లండన్: రోజుకు 11 నిమిషాలు వేగంగా నడవడం లాంటి శారీరక వ్యాయామం చేస్తే గుండె జబ్బులు, గుండె పోటు, వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం తగ్గుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్’ జర్నల్లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి.
యూకేకు చెందిన నేషనల్ హెల్త్ మిషన్ సూచించిన శారీరక శ్రమ సూచనల్లో సగం పాటించినా సగటు జీవిత కాలం కంటే ముందుగానే సంభవిస్తున్న 10 మరణాల్లో ఒక దానిని నిరోధించవచ్చని పరిశోధకులు తెలిపారు. వారానికి 150 నిమిషాల సేపు శారీరక శ్రమ చేస్తే ఫలితాలుంటాయన్నారు.