Cardiac Arrest | థీమ్ పార్క్‌లో విషాదం : ఐదేండ్ల బాలుడికి కార్డియాక్ అరెస్ట్
Cardiac Arrest : థీమ్ పార్క్‌లో ఐదేండ్ల బాలుడు కార్డియాక్ అరెస్ట్‌కు గురైన ఉదంతంలో నిర్లక్ష్యం వహించిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
Cardiac Arrest : థీమ్ పార్క్‌లో ఐదేండ్ల బాలుడు కార్డియాక్ అరెస్ట్‌కు గురైన ఉదంతంలో నిర్లక్ష్యం వహించిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రిటన్‌లోని లెగోల్యాండ్ విండ్సర్ రిసార్ట్‌లో గురువారం ఈ ఘటన జరగ్గా ఎసెక్స్కు చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. కార్డియాక్ అరెస్ట్‌కు గురైన బాలుడు ప్రస్తుతం స్ధానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అతడి పరిస్ధితి ఇంకా విషమంగానే ఉందని తెలిసింది.
మహిళ నిర్లక్ష్యంతోనే బాలుడు అకారణంగా గాయపడ్డాడనే ఆరోపణలపై మహిళ (27)ను అరెస్ట్ చేసి జులై 26 వరకూ బెయిల్‌పై విడుదల చేశారు. ఈ దురదృష్టకరఘటన జరిగిన వెంటనే బాలుడి తల్లితండ్రులను తాము సంప్రదించామని, వారికి ఈ సంక్లిష్ట సమయంలో తోడుగా ఉన్నామని థేమ్స్ వ్యాలీ చైల్డ్ అబ్యూజ్ దర్యాప్తు విభాగానికి చెందిన జో ఎలె తెలిపారు.
ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో రిసార్ట్‌లో ఉన్న వారితో తమ బృందం సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. మరోవైపు థీమ్ పార్క్‌ను సందర్శించిన చిన్నారి అతిధి అస్వస్థతకు గురవగా, ప్రధమ చికిత్సలో సుశిక్షితులైన తమ బృందం అత్యవసర సేవల విభాగం చేరుకునేలోపు ప్రాథమిక చికిత్స అందించిందని, తాము దర్యాప్తులో థేమ్స్ వ్యాలీ పోలీసులకు సహకరిస్తామని థీమ్ పార్క్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Read More :
Amethi | అమేథిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి.. కార్లు ధ్వంసం
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Boy
- Cardiac arrest
- Theme Park
- UK
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

