బాంబ్ సైక్లోన్ బీభత్సం.. 19 మంది మృత్యువాత
అగ్రరాజ్యం అమెరికాను బాంబ్ సైక్లోన్ వణికిస్తున్నది. మంచుతుఫాన్ కారణంగా ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
- అమెరికా ఉక్కిరిబిక్కిరి
- 60 శాతం మందిపై ప్రభావం
- అంధకారంలో 17 లక్షల ఇండ్లు
- 5,700 విమానాలు రద్దు
వాషింగ్టన్, డిసెంబర్ 24: అగ్రరాజ్యం అమెరికాను బాంబ్ సైక్లోన్ వణికిస్తున్నది. మంచుతుఫాన్ కారణంగా ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కనీసం బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొన్నది. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో దాదాపు 17 లక్షల ఇండ్లు, వ్యాపార సంస్థలు అంధకారంలోకి జారుకున్నాయి. ముఖ్యంగా 13 రాష్ర్టాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పవర్ ప్లాంట్లను నడపడం కష్టసాధ్యంగా ఉందని మేజర్ గ్రిడ్ అధికారులు తెలిపారు. దేశంలోని 60 శాతం మందిపై ఈ మంచు తుఫాను ప్రభావం పడింది. దేశ వ్యాప్తంగా 5,700 విమానాలను రద్దు చేశారు. పలు చోట్ల రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ఆయా రహదారులను మూసివేశారు. క్రిస్మస్ సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. తుఫాన్ కారణంగా 19 మంది మృత్యువాతపడ్డారు. క్రిస్మస్ ముందు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో ఫ్లోరిడా, మేరిలాండ్, న్యూజెర్సీ, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, కెంటకీ తదితర ప్రాంత ప్రజలు వేడుకలకు దూరంగా ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

