న్యూఢిల్లీ: మక్కాలోని పవిత్ర కాబాలో అల్ హజర్ అల్ అస్వద్ (నల్లని రాయి) ఫొటోలను సౌదీ అరేబియా విడుదల చేసింది. అత్యంత స్పష్టతతో కూడిన ఈ చిత్రాలను విడుదల చేయడం ఇదే తొలిసారి.ఫోకస్ స్టాకింగ్ అనే సాంకేతికతతో 1,050 ఫొటోలను కలిపి 50 గంటలు కష్టపడి ఈ చిత్రాలను 49 వేల మెగాపిక్సెల్‌ల సైజుతో అత్యంత స్పష్టంగా వచ్చేలా చేశారు.