బెజోస్, బిల్‌గేట్స్ తర్వాత.. ఇదే భారీ విడాకుల డీల్.. ఎవరిదో తెలుసా?
Divorce Claim | ప్రపంచ కుబేరులు ఒక్కొక్కరే విడాకుల బాట పడుతున్నారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ దంపతులు విడాకులు తీసుకున్న

Divorce Claim | ప్రపంచ కుబేరులు ఒక్కొక్కరే విడాకుల బాట పడుతున్నారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ దంపతులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విడాకుల సమయంలో డైవర్స్ క్లెయిమ్ కింద తమ ఆస్తుల్లో భారీ వాటాలను భార్యలకు చెల్లించారీ కుబేరులు. ఇప్పుడు వీరి తర్వాత అంతభారీ విడాకుల డీల్ లండన్ కోర్టు ముందుకొచ్చింది.
రష్యాలో రెండో అతిపెద్ద సంపన్నుడు వ్లాదిమిర్ పొతానిన్.. అతని భార్య విడాకులు తీసుకుంటున్నారు. ఈ విడాకుల డీల్ కింద తనకు 7 బిలియన్ డాలర్లు విలువైన ఆస్తులు కావాలంటూ పొతానిన్ భార్య నటాలియా కేసు వేసింది. ఎంఎంసీ నోరిలిస్క్ నికెల్ పీజేఎస్సీ అనే కంపెనీలు వ్లాదిమిర్‌కు భారీగా షేర్లున్నాయి.
వీటిలో యాభై శాతం తనకు కావాలని నటాలియా అడుగుతోంది. వీటితోపాటు ఈ షేర్లపై 2014 నుంచి వచ్చిన డివిడెంట్లు కూడా కావాలంటోంది. అప్పటి నుంచి ఈ షేర్లపై సుమారు 6.6 బిలియన్ డాలర్ల డివిడెంట్లు సేకరించాడు వ్లాదిమిర్. ఇప్పుడు ఈ సొత్తును తనకు అప్పగించాలని నటాలియా అడుగుతోంది. ఈ షేర్లు, డివిడెంట్లు కలిపి సుమారు 29.9 బిలియన్ డాలర్లు విలువ చేస్తాయని తెలుస్తోంది.
ఈ కేసు లండన్ కోర్టు ముందుకు రావడానికి ముందు రష్యా విడాకుల ప్రక్రియ ప్రకారం తనకు 40 మిలియన్ డాలర్లు ఇచ్చారని నటాలియా తెలిపింది. అయితే ఆమెకు 84 మిలియన్ డాలర్ల వరకూ చెల్లించానని వ్లాదిమిర్ వాదించాడు. వీళ్లిద్దరూ 31 ఏళ్లపాటు కలిసి జీవించారు. ఈ సుదీర్ఘ సహజీవనం తర్వాత ఆమెకు అందిన పరిహారం చాలా తక్కువని బ్రిటన్ కోర్టు అభిప్రాయపడింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

