Biggest Diamond | బోట్స్వానా గనిలో 2,492 క్యారెట్ల భారీ వజ్రం.. 1905 తర్వాత ఇదే మొదటిసారి
బోట్స్వానాలోని సుప్రసిద్ధ వజ్రాల గని కరోవేలో భారీ వజ్రం దొరికింది. దీని బరువు 2,492 క్యారెట్లు అని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.
Biggest Diamond | న్యూఢిల్లీ : బోట్స్వానాలోని సుప్రసిద్ధ వజ్రాల గని కరోవేలో భారీ వజ్రం దొరికింది. దీని బరువు 2,492 క్యారెట్లు అని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. దీనిని ఎక్స్-రే టెక్నాలజీ సహాయంతో గుర్తించినట్లు కెనడియన్ మైనింగ్ కంపెనీ లుకారా డైమండ్ కార్పొరేషన్ తెలిపింది. ఇది అత్యధిక నాణ్యత కలిగిన వజ్రం అని వివరించింది.
దక్షిణాఫ్రికాలో 1905లో 3,106 క్యారెట్ల కలినన్ వజ్రం దొరికిందని, ఆ తర్వాత దొరికిన అతి పెద్ద వజ్రం ఇదేనని పేర్కొంది. కలినన్ వజ్రాన్ని జెమ్స్‌గా ముక్కలు చేశారని, వీటిలో కొన్ని జెమ్స్ బ్రిటిష్ క్రౌన్ ఆభరణాల్లో ఉన్నాయని తెలిపింది. వజ్రాలు అధికంగా దొరికే దేశాల్లో బోట్స్వానా రెండోది.
ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచంలోని అతి పెద్ద వజ్రాలన్నీ ఇక్కడ దొరికినవే కావడం విశేషం. కరోవే గనిలో 2019లో దొరికిన 1,758 క్యారట్ల సెవెలో వజ్రం ఇప్పటి వరకు రెండో అతి పెద్ద వజ్రంగా రికార్డుల్లో ఉండేది. దీనిని ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్ లూయిస్ వుయిట్టన్ కొనుగోలు చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

