Biden on Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ నేరగాడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాడన్న అభియోగంపై పుతిన్‌పై విచారణ జరుపాలని సోమవారం విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌లోని బుచ పట్టణంలో పౌరుల హత్యాకాండపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. బుచలో ఏం జరిగిందో మీరంతా చూస్తున్నారని వైట్‌హౌస్‌లో మీడియాతో చెప్పారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని బుచ పట్టణంలో సామూహికంగా సమాధి చేసిన మృతదేహాలు బయట పడ్డాయి. ఈ నేపథ్యంలో రష్యాపై అదనపు ఆంక్షలు విధించేందుకు అమెరికా, యూరప్ సిద్ధమయ్యాయి.
మేం సమాచారం సేకరించాల్సి ఉంది. పూర్తి వివరాలు రావాల్సి ఉంది. వాస్తవంగా పుతిన్ యుద్ధ నేరాలపై విచారణ జరుపాలి. పుతిన్ క్రూరుడు. రష్యాపై యుద్ధం చేయడానికి అవసరమైన ఆయుధాలను ఉక్రెయిన్‌కు మేం అందజేస్తూనే ఉంటాం. బుచ పట్టణంలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అని చెప్పారు. కానీ, బుచ పట్టణంతోపాటు ఉక్రెయిన్‌లో పౌరులను హత్య చేశామన్న ఆరోపణలను రష్యా నిరాకరిస్తున్నది.