Travel Agents | ట్రావెల్ ఏజెంట్లతో జాగ్రత్త.. ప్రవాసులకు భారత రాయబార కార్యాలయం హెచ్చరిక
అమెరికాలోని ప్రవాస భారతీయులు మోసపూరిత ట్రావెల్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. ఈ మేరకు కాన్సుల్ జనరల్ బినయ ప్రధాన్ ఒక ప్రకటన జారీ చేశారు.
- ప్రవాస భారతీయులకు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరిక
Travel Agents | న్యూయార్క్: అమెరికాలోని ప్రవాస భారతీయులు మోసపూరిత ట్రావెల్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. ఈ మేరకు కాన్సుల్ జనరల్ బినయ ప్రధాన్ ఒక ప్రకటన జారీ చేశారు. రాయబార కార్యాలయం నుంచి పొందే సేవలకు గానూ కొందరు ట్రావెల్ ఏజెంట్లు విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రజల నమ్మకాన్ని వీరు వమ్ము చేస్తున్నారని పేర్కొన్నారు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డులు, వీసాలు, పాస్‌పోర్టులు, ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు ఇప్పించేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని తెలిపారు. ఉదాహరణకు, ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం రాయబార కార్యాలయం 17 డాలర్లు తీసుకుంటుండగా, కొందరు ట్రావెల్ ఏజెంట్లు 450 డాలర్ల వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. కొందరు ట్రావెల్ ఏజెంట్లు కాన్సులేట్ నుంచి సేవలు ఇప్పించేందుకు నకిలీ డాక్యుమెంట్లు సమర్పిస్తున్నారని తెలిపారు. గుర్తింపు, నివాస ధ్రువీకరణ, యుటిలిటీ బిల్లులకు సంబంధించి దరఖాస్తుదారుల తరపున, వారికి తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారని చెప్పారు. వీటి వల్ల దరఖాస్తుదారులు అమెరికాలో న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొనే ముప్పు ఉందని తెలిపారు.
నేరుగా కార్యాలయానికే రావొచ్చు
రాయబార కార్యాలయం నుంచి అందే సేవల కోసం ట్రావెల్ ఏజెంట్లను ఆశ్రయించాల్సిన అవసరం లేదని, నేరుగా కార్యాలయానికి వచ్చి సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ-వీసా సేవలకు సంబంధించి కూడా 140కి పైగా నకిలీ వెబ్సైట్లను గుర్తించామని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రవాస భారతీయులకు సూచించారు. అమెరికాలోని భారతీయ విద్యార్థులకు సులభంగా సేవలు అందించేందుకు ప్రమిత్, భారతి చాట్‌బోట్ వంటి టూల్స్‌తో పాటు మొబైల్ యాప్ అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు, న్యాయ, వైద్య సమాచారం కూడా అందిస్తున్నట్టు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Monal Gajjar | క్యాన్సర్‌ను జయించిన టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్.!
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు రేవంత్ రెడ్డి.. వీడియో
ప్రతి ఇంటికి ఇంకుడుగుంతను నిర్మించుకోవాలి : డీఎల్పీవో సుధీర్‌కుమార్
KTR | సివిల్స్ విద్యార్థిని కోల సింధు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
గాంధీనగర్‌లో అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

