కొన్ని సముద్ర జీవులు భలే వింతగా ఉంటాయి. మహాసముద్రాల్లో మనం చూడని ఎన్నో జీవులున్నాయి. అలాంటి కోవకు చెందినదే ఈ బెలుగా తిమింగలం. మృదువైన, మెత్తటి తలతో అచ్చం ఓ రబ్బరు బొమ్మలా ఉంటుంది. ఈ తిమింగలానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
బెలుగా వేల్ వీడియోను రెడ్డిట్లో ఒకరు షేర్ చేశారు. ఈ తిమింగలం తలను అక్వేరియం సందర్శకుడు చేతితో తాకుతుంటే మెత్తని స్పాంజిలా లోపలికి పోవడం కనిపిస్తుంది. అది కొవ్వుతో తయారైనట్లు తెలుస్తోంది. అలా తలపై ఒత్తగానే అది నోరు తెరిచింది. ఆ సందర్శకుడు దాని నోట్లోకి చేలు విసరగా, ఎంచక్కా తినేసింది. ఈ వీడియో నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంది. మొదటిసారి ఇలాంటి వెరైటీ తిమింగలాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో పెట్టిన కొద్దిసేపట్లోనే 27,00కంటే ఎక్కువమంది వీక్షించారు.